Superstitions :మానవుడు జీవనం కొనసాగిస్తున్న దశ నుండి చివరి వరకు ప్రతీదీ అనాదిగా వస్తున్న ఆచారాల వ్యవహా రాల్లో ఉండే విశ్వాసాలను ఎక్కువగా అనుసరిస్తూనే ఉంటా రు.
కొన్నిసార్లు అతివిశ్వాసాలు అనర్థదాయకాలుగా గోచరి స్తుంటాయి. తెలిసి తెలియక పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వలన కావచ్చు, కొన్ని అపోహలను కల్పించు కొని సమాజంలో వాస్తవికతకు దూరంగా ఉండడం వలన దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. ఈ క్రమంలోనే మానవ మేధస్సు ఊహాత్మకమైన మానసిక సంఘర్షణకు లోనుఅయ్యే క్రమంలోనే మూఢ నమ్మకాలు విస్తరిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. అట్లాని సమయ సందర్భానుచితంగా కొన్ని విషయాలు నమ్మగలిగే రీతిలో ఉంటే నమ్మకాలు వమ్ము కావేమో. మితిమీరిన మూఢనమ్మకాలు సమాజంలో మానవుల మానసిక వికాసం పై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. నమ్మకాలు ప్రగతి శీలకమైనవిగా ఉండాలి తప్ప సమాజాన్ని అంధకారంలోకి తీసుకుపోయే విధంగా ఉండకూడదు. నమ్మకాలు మానవ జీవన విధానాల్లో క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ, మూఢ నమ్మకాలు మాత్రమే సమాజంలో చాలా సార్లు అనర్థాలను సృష్టిస్తుంటాయి. చేతబడి, దెయ్యాలు, భూతాలు ఇలాంటి పదాలన్నీ కూడా మానవ జీవన విధానాల్లో మూఢ విశ్వా సాలకు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. మానవ మేధస్సు లోకి చొచ్చుకు వస్తున్న అనేక భిన్న ఆలోచనలు మానవుల్లో అనేక సందేహాలు సమస్యలకు కారణం అవుతున్నాయి. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోలేని పరిస్థితిల్లో లేన ప్పుడు ఈ క్రమంలో కొన్నిసార్లు కొందరు సమస్యలకు వ్యతి రేక శక్తులే కారణం కావచ్చునే సంఘర్షణతో మూఢ విశ్వా సాల వైపు మొగ్గుచూపుతుండడం గమనార్హం. అయితే మూఢనమ్మకాలు మానవ జీవన విధానాలకు అవరోధాలుగా మిగిలిపోకూడదు.
Read Also : Vijayawada Durgamma temple: కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్‌మాల్.. ఇద్దరు ఉద్యోగులపై వేటు
Superstitions
Superstitions : విశ్వాసం మనిషి ఆత్మ స్థైర్యానికి ప్రతీక
మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం మానవుడు తన చుట్టూ ఉన్న పరిసరాల్లో తిలకించే ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు వేసుకుని సమా ధానం దొరికినప్పుడే దానికి సరిగా స్పందించే తీరు నమ్మక మైనదిగా ఉంటుందని అనిపిస్తుంది. నిర్దిష్టమైన సరైన విశ్వాసం మనిషి ఆత్మ స్థైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఇదే గనుక వ్యతిరేకంగా స్పందిస్తే అది మరో రూపం దాలుస్తుంది. చివరకు అచేతన స్థితిలోకి నెట్టి వేయబడు తుంది. ఇది మానవుని ఆలోచన ధోరణిని బట్టి మారుతూ ఉంటుంది. సాంకేతికపరమైన అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న శాస్త్రాన్ని సాంకేతికతను ఆధ్యాత్మికంతో జోడిం చే విధానం తరచుగా గోచరిస్తూ ఉంటుంది. అంతరిక్ష ప్రయోగాల నుండి మొదలు మానవుని దైనందిన జీవితం వరకు జీవితంలో నిర్ణీతమైన మంచి ఘడియలు, పంచాం గాల లాంటి వాటి పరిమితిలోనే పనులు చేయడం అనేది చూస్తుంటాం. చాలావరకు ముహూర్తాలను పెట్టుకుని పను లను ప్రారంభిస్తుంటారు. ప్రేతాత్మలు ఉంటాయని వాటిని నిలువరించేందుకు పరమాత్మ స్వరూపాన్ని నమ్ముకోవడం చేసిన పనులు సక్రమంగా జరగడానికి విఫలం కాకుండా ఉండడానికి పూజలను నిర్వహించడం వ్యతిరేక భావనలను దుష్టశక్తులను అధిగమించడానికి దైవం అనే అంశం ముం దుకు తీసుకురావడం ఇలాంటి ఎన్నో విషయాలు గమనిస్తే కొన్నిసార్లు మానవ మేధస్సు ఎంత ఉన్నతమైందో అంత భయం భక్తితో కూడుకున్నదని అనిపిస్తుంటుంది.
గారడి విద్యలు
గారడి విద్యలు లాంటివి ఎన్నో వినోదాత్మకంగా చాలావరకు అందరినీ రంజిపచేస్తుంటాయి. ఇలాంటి గారడీ విద్యలే మోస గాళ్ల చేతిలోకి వెళ్లి సమాజంలో మూఢవిశ్వాసాలను అధికంగా నమ్మేవారిని మోసం చేయడానికి దోహదపడతాయి. సాధ్యమైనంత వరకు భౌతికపరంగా వాస్తవికతను గుర్తించి నిజాన్ని కళ్ళతో చూసినప్పుడే విశ్వాసాలను నమ్మాలి కానీ ఏదో చెప్తే ఊహ ప్రపంచంలో కెళ్ళి చెప్పింది నమ్మితే అది నిజం కాదు. అలాంటప్పుడు అతి విశ్వాసాలు కూడా మితి మీరితే ఉపద్రవాలే వస్తాయి. విశ్వాసం ఉంటేనే మనిషి బతుకు జీవన విధానంలో అనుకున్నది సాధించగలరు. అదే మూఢవిశ్వాసాలు అయితే మానవ జీవన విధానాలు అనేక రకమైనటువంటి సమస్యలు తెచ్చి పెడుతుంటాయి. గతంతో పోలిస్తే సైన్స్ బాగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్ప టికి ఎక్కువ శాతం మూఢవిశ్వాసాలపైన ఆసక్తి కనబరు స్తున్న వారులేకపోలేదు. కొందరు జన్మనామాన్ని, రాశులు నక్షత్రల ప్రామాణికంగా జాతకాలను సరిపోల్చుకుంటారు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం ప్రభావాలను సైన్స్ దృష్టితో సరిచూడని వారు ఇప్పటికీ లేకపోలేదు. ఇలాంటివి ఎన్నో విషయాలు మానవ సమాజంలో అడపా దడపా గోచరిస్తుం టాయి.
Superstitions
మూఢవిశ్వాసాలపై సమాజానికి స్పృహ
ఆధునిక యుగంలో కూడా మూఢవిశ్వాసాలపై ఆసక్తి అధికంగానే చూపిస్తున్న వారు ఎక్కువగానే ఉంటు న్నారు. తద్వారా కొంతమంది వీటిని ఆసరా చేసుకుని సొమ్ము చేసుకోవడానికి వివిధ అవతారాలు ఎత్తి ప్రజలను నమ్మబలికి వారి నమ్మకాలను చివరికి వమ్ము చేసి మోసం చేస్తున్న మోసగాళ్లు మూఢవిశ్వాసాల పేరు మీద లక్షలాది రూపాయలు వసూలు చేసి పారిపోతున్నారు. నమ్మకాలు కూడా కొన్నిసార్లు అర్థరహితంగా మారుతుంటాయి. ఒక విషయంపై లోతుగా ఆలోచించే విధానం మానవ సమూహా ల మధ్య ఒకేవిధంగా ఉండదు. ఏదైనా నష్టం కలిగిస్తుందని మనసుకు అనిపిస్తే సరైన రీతిలో మానవ మేధస్సుకు జవాబు దొరకని పరిస్థితుల్లో మూఢవిశ్వాసాలకు దగ్గరవు తుంటారు. కొన్నిసార్లు సమాజంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో కొన్ని ప్రాంతాల్లో అనాగరికంగా అనుమానితులపై దాడులు కూడా జరుగుతున్నాయి. సమాజంలో కొంతమంది మనిషి మానసిక బలహీనతను ఆసరాగా చేసుకుని మంత్ర గాళ్లుగా కొత్త అవతారాలు ఎత్తుకొని మోసం చేసే రీతిలో ఏవో కట్టుకథలు చెప్పి డబ్బును దోచుకుపోతున్నారు. కార ణాలేవైనా మనసు బలహీనంగా ఉన్నప్పుడే మూఢ విశ్వాసాలను బలంగా నమ్ముతారు. అలాంటి మానసిక బలహీ నతల నుండి బయటపడేందుకు వాటిపై అవగాహన కలిగి నటువంటి బోధకులు ఆధ్యాత్మిక గురువులు మానసికవేత్తలు శాస్త్రవేత్తలు సామాజిక స్పృహ కలిగిన వారందరూ నిరంత రం సమాజంలో మూఢవిశ్వాసాలపై సమాజానికి స్పృహ కలిగే విధంగా వివరణాత్మకమైన సందేశాలను మరింతగా సమాజంలో విస్తృతపరచాల్సి ఉంటుంది.
-దాడిశెట్టి శ్యామ్ కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper :epaper.vaartha.com
Read Also:
భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి అందుబాటులోకి రోప్‌వే

