Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ: అధికారులకు స్థల పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం

శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ: అధికారులకు స్థల పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం

వార్త 1 month ago

Husnabad: హుస్నాబాద్ ఉమ్మాపూర్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ & అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణాలు జరిగే స్థలాన్ని పరిశీలించి స్థల పత్రాలను అధికారులకు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.

త్వరలోనే ప్రారంభం కానున్న భవన నిర్మాణాలు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, యూనివర్సిటీ వీసీ ఉమేష్, ఇతర అధికారులు.

Read Also: Komatireddy Raj Gopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయి భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది..టెండర్ కూడా పూర్తయింది. ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణాలు చేపట్టే స్థలాన్ని కేబినెట్ అప్రూవల్ చేసిన అనంతరం ఈరోజు స్థలాన్ని యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.. విద్యార్థి విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మాణాలు జరుగుతాయి. మంచి గ్రామీణ ప్రాంత వాతావరణంలో ఆహ్లాదభరితంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడుతుంది. అటు ప్రభుత్వం నుండి ఇటు స్థానిక ప్రజా ప్రతినిధి గా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది.

Husnabad: హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లో విద్యార్థులు చేరి మంచిపేరు తీసుకురావాలి. ప్రస్తుతం గాంధీ నగర్ లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ఆవరణలో ఒకటిన్నర ఎకరాల్లో ATC (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని స్థలాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఈ రెండు కాలేజీ లకు త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి. కూచనపల్లి - మాలపల్లి మధ్య న్యాక్ సెంటర్ మంజూరు అయింది. స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. నియోజకవర్గంలో విద్యా, వైద్యం, ఉపాధి టూరిజం మెరుగుపడలని ఆశిస్తున్న..

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

సూపర్వైజర్ల అసభ్య ప్రవర్తన.. తక్షణమే తొలగించాలని సీపీఎం డిమాండ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha