ACB Raid: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన సిఐ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వరులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!
ACB Raid: అసలేం జరిగింది?
కేరళకు చెందిన ఒక వ్యక్తి నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్‌తో ప్రయాణిస్తూ పట్టుబడటంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఎయిర్‌పోర్ట్ అవుట్‌పోస్ట్ సిఐ కనకయ్య మరియు ఎస్ఐ సిద్ధేశ్వరులు నిందితుడి నుండి రూ. 15 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ డబ్బు ఇవ్వకపోతే, నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యుల పేర్లను కూడా కేసులో చేరుస్తామని బెదిరించారు.
రూ. 2 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్!
పోలీసుల వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తాను రూ. 15 లక్షలు ఇవ్వలేనని, రూ. 5 లక్షలు ఇస్తానని పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తొలి విడతగా రూ. 2 లక్షలు పోలీస్ స్టేషన్‌లో ఇస్తుండగా, నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు దాడి చేసి పోలీసులను పట్టుకున్నారు.
అర్ధరాత్రి వరకు సోదాలు
ఈ దాడి అనంతరం ఏసీబీ అధికారులు అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో నిన్న అర్ధరాత్రి వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కేసు ఫైళ్లను, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడిన సిఐ, ఎస్ఐలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

