Dailyhunt
శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత.. హరీశ్ రావు ధ్వజం!

శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత.. హరీశ్ రావు ధ్వజం!

వార్త 1 week ago

Shankar Goud Death: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ విషాద ఘటనపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.

ప్రభుత్వ మొండి వైఖరి, నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం బలి అయిందని ఆయన ఆరోపించారు.

Read Also:Vasavi mata jayanthi : వాసవీ మాత జయంతి రాష్ట్ర పండుగగా.. కీలక నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి

 Shankar Goud Death: CM Revanth Reddy is responsible for Shankar Goud’s death.. Harish Rao’s flag!

శంకర్ గౌడ్ మృతి వార్తపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన హరీశ్ రావు, ఈ మరణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం ఇంకెంత మంది కార్మికులను బలి తీసుకుంటుందని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలి

ఆర్టీసీని కాపాడుకోవడానికి శంకర్ గౌడ్ చేసిన ఆత్మబలిదానం తన హృదయాన్ని కలిచివేసిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ మరణించిన రోజును 'అపాయింటెడ్ డే' గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. “జోహార్ శంకర్ గౌడ్” అంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

కార్మికులకు భరోసా: “ప్రాణాలు తీసుకోవద్దు”

ప్రస్తుతం ఆందోళనలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు హరీశ్ రావు ధైర్యం చెప్పారు. “బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది. ఎవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దు. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి హక్కులను సాధించుకుందాం. దయచేసి ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha