Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

వార్త 1 week ago

Sharwanand New movie: విభిన్నమైన కథల తో వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్, ఇప్పుడు సీనియర్ దర్శకుడు శ్రీనువైట్లతో జతకట్టారు.

వీరిద్దరి కలయికలో ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందనుంది. శ్రీనువైట్ల కామెడీకి ఈసారి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడిస్తుండటం విశేషం.

శ్రీనువైట్ల సినిమాలు అంటేనే ఎంటర్టైన్మెంట్. అయితే, ఈ కొత్త చిత్రంలో ఆయన కేవలం కామెడీకే ఒకటే కాకుండా ‘టైమ్ ట్రావెల్’ అనే ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. శర్వానంద్ అద్భుతమైన టైమింగ్‌కు, శ్రీనువైట్ల మార్క్ హ్యూమర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మేజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

Read Also : Peddi Movie: 'పెద్ది' కోసం ప్రాణం తీసుకుంటా.. చరణ్ ఫ్యాన్ ఎమోషనల్ లేఖ వైరల్!

 Manasa Varanasi snatches a chance opposite Sharwanand!

Sharwanand New movie: హీరోయిన్‌గా మానస వారణాసి

ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరనే దానిపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలకు తెరపడింది. మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసిని ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘కపుల్ ఫ్రెండ్లీ’ వంటి చిత్రాలతో మెప్పించిన మానసకు, శర్వానంద్ సరసన నటించే అవకాశం రావడం ఒక పెద్ద బ్రేక్ అని చెప్పవచ్చు. ఈ కొత్త జోడీ స్క్రీన్ మీద ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీల్‌ను ఇవ్వనుంది.

షూటింగ్, రిలీజ్ అప్‌డేట్స్

ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ చిత్రం జులైలో షూటింగ్ ప్రారంభించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి (2027) బరిలో ఈ సినిమాను నిలపాలని చిత్రబృందం పక్కా ప్లానింగ్‌తో ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha