Shreyas iyer: వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారం చేసింది. మంగళవారం లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌ను 8 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.
ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Bhuvneshwar Kumar: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. భువీ రీఎంట్రీ
అదరగొట్టిన భారత బౌలర్లు
టస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ షాయ్ హోప్ మినహా వరుసగా ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. అయితే మిడిల్ ఓవర్లలో హోప్ (52), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (56) అర్ధశతకాలతో పోరాడారు. చివరికి కరేబియన్ జట్టు 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర మ్యాచ్‌లోనే నమన్ ధీర్ (3/31) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు.

శ్రేయస్ విధ్వంసం.. తొలి టీ20 సెంచరీ
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (21), సంజూ శాంసన్ (11) వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మైదానం నలుమూలలా విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన శ్రేయస్, కేవలం 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు.
శ్రేయస్‌కు తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్ 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది.
Epaper: epaper.vaartha.com

