Srinivas Reddy : ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందంటే చాలా ఆనంద పడతారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల, తోపాటు పలు శాఖల్లో ఉద్యోగం వస్తే ఇక తమ పంట పండిందని అనుకుంటారు.
ఎందుకంటే.. జీతంతో పాటు లంచాలు తీసుకుని కోట్ల రూపాయలు సంపాదించవచ్చని అనుకుంటారు. అయితే నిజాయితీగా పని చేసేవారు కూడా ఉంటారు. అయితే ఎక్కువ శాతం మాత్రం తాయిళాలకు అలవాటు పడి ఉంటారు. అయితే కొంత మంది లంచాలతో కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా ఓ అధికారి భారీగా అక్రమాస్తులు కూడబెట్టి ఏసీబీకి దొరికిపోయారు. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.
Read Also: Marri Janardhan Reddy: బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదు
Srinivas Reddy
Srinivas Reddy : భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తుల గుర్తింపు
శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి వద్ద కిలోకు పైగా బంగారం, ఆయన 7 బ్యాంకు ఖాతాల్లో రూ.8 లక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 8 ప్లాట్లు, యాచారంలో 10 ఎకరాల భూమితో పాటు హస్తినాపురంలో మూడంతస్తుల భవనం ఉన్నట్లు తెలిసింది. శ్రీనివాసరెడ్డి ఇంట్లో రూ.4 లక్షలు, 3 కార్లు, 3 ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి. ఓ బారులో కుమారుడి పేరిట రూ.86 లక్షలు పెట్టుబడి కూడా పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరెడ్డి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్మన్‌ఘాట్‌లో రూ.2.63 కోట్లు విలువ చేసే రెండు ప్లాట్లు, కర్మన్‌ఘాట్‌లో G+3 పెంట్‌హౌస్ విలువ రూ.1.61 కోట్లు, యాచారం నల్లవెల్లిలో 10 ఎకరాల 08 గుంటల వ్యవసాయ భూమి, నగర పరిధి, శివార్లలో 8 ఖాళీ స్థలాలు, బాలాపూర్‌లోని నరేంద్ర బార్ & రెస్టారెంట్‌లో పెట్టుబడులు.. వాటా రూ.86 లక్షలు, రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, బ్యాంకులో 46 తులాల బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించారు.
Epaper: epaper.vaartha.com

