Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైలంలో అట్టహాసంగా 'మినీ మహానాడు'.. పసుపు రంగుగా మారిన ప్రాజెక్ట్ కాలనీ!

శ్రీశైలంలో అట్టహాసంగా 'మినీ మహానాడు'.. పసుపు రంగుగా మారిన ప్రాజెక్ట్ కాలనీ!

వార్త 2 months ago

Srisailam Mini Mahanadu: వైభవంగా శ్రీశైలంలో మినీ మహానాడు. ఏపీలో వైభవంగా మినీ మహానాడు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, శ్రీశైలం మండలంలో మినీ మహానాడు కార్యక్రమాలు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైల మండలం తెలుగుదేశం ఇన్చార్జి యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఉదయం ప్రాజెక్ట్ కాలనీలో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున బైక్ మరియు సైకిల్ ర్యాలీలను నిర్వహించారు.

Read also:Kalyanadurgam news: భైరవాణి తిప్ప సాగునీటి ప్రాజెక్టుపై ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పష్టత

 Srisailam Mini Mahanadu 2026 TDP MLA Budda Rajasekhar Reddy Yugandhar Reddy

Srisailam Mini Mahanadu: తెలుగు తమ్ముళ్లు ఉత్సాహవంతంగా ర్యాలీలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం సున్నిపెంటలో గల రెడ్ల కళ్యాణమండపం నందు తెలుగు తమ్ములతో శ్రీశైలం మండల ఇన్చార్జి యుగంధర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ మహానాడు పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమని కార్యకర్తలకు సూచించారు. ఈ పండుగ రాష్ట్రవ్యాప్తంగా జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాదులని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్లస్టర్లు,బూతు కన్వీనర్లు, కార్యకర్తలు,మరియు శ్రీశైలం మండలం తెదేపా నాయకులు నాగేల్ల సురేష్ ,శ్రీనివాస్ రెడ్డి, సింగతల చిన్న నరసింహారెడ్డి, జూలియా నాయక్, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

సరికొత్త డిజిటల్ హంగులతో 'మహానాడు 2026' షురూ.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha