Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైలంలో చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

శ్రీశైలంలో చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

వార్త 1 month ago

Srisailam Temple Free Darshan: శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించడం జరుగుతుంది.

గత డిసెంబరు నెలలో ముక్కోటి ఏకాదశి రోజున ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రతీ నెలలో కూడా చివరి రోజున చెంచు గిరిజన భక్తులకు ఈ ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు చెంచు భక్తులకు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం ఉచితంగా దర్శించుకున్నారు. అదేవిధంగా దర్శనానంతరం చెంచు భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణా ప్రసాదవితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయబడ్డాయి.

Read Also:Annavaram Satyanarayana Swamy: అంగరంగ వైభవంగా సత్యదేవుని దివ్య కల్యాణం

Srisailam Temple Free Darshan: ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో సంబంధిత సిబ్బంది ఆహ్వానం పలికారు. శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచు గిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకోవడం జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha