Srisailam News: మే 9,శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వచ్చిన ఢిల్లీ భక్తులకు సైబర్ మోసగాళ్లు టోకార వేశారు. శ్రీశైలంలో మల్లికార్జున సదనములో 9 ఏసీ గదులను ఓ వెబ్సైట్ ద్వారా భక్తులు బుక్ చేసుకున్నారు.గదుల బాడుగ నిమిత్తం భక్తులు రూ.
15 వేల రూపాయలు పేటియం ద్వారా చెల్లించడం జరిగింది.దేవస్థానం కు చెందిన మల్లికార్జున సదనంలో గదుల కొరకు సంప్రదించగా అక్కడి సిబ్బంది బుక్కు కాలేదని చెప్పడంతో ఢిల్లీ భక్తులు షాక్కు గురయ్యారు. దీంతో ఢిల్లీ భక్తులు సైబర్ మోసానికి గురి అయ్యామని వారు గుర్తించారు. ఢిల్లీ వాసులు హైదరాబాద్ నుంచి శనివారం నాడు 27 మంది టూరిస్ట్ బస్సులో శ్రీశైలం కు చేరుకున్నారు.
Read Also : Jangaon Snake Bite Incident: నిద్రిస్తున్న బాలుడిని కాటేసిన రెండు విష పాములు
నకిలీ వెబ్సైట్లతో సైబర్ మోసగాళ్లు యాత్రికులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.ఢిల్లీ వాసులు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారని తెలుసుకున్న శ్రీశైల దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు స్పందించారు.మోసపోయిన భక్తులకు వారికి ఉచిత వసతి,భోజనం, దర్శనం ఏర్పాట్లు చేశారు.సైబర్ మోసగాళ్ల చేతుల్లో మోసపోయిన ఢిల్లీ భక్తుల నుండి లిఖితపూర్వకంగా దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు ఫిర్యాదును తీసుకున్నారు.
Srisailam News
సైబర్ మోసాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.దేవస్థానం తరఫున తమకు కావాల్సిన ఉచిత వసతి,భోజనము, దర్శనం ఏర్పాట్లు చేసినందుకు భక్తులు ఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.భక్తులు నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని ఈవో కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

