Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఐ చిన్నమల్లయ్య కేసులో హైకోర్టు కీలక తీర్పు

సీఐ చిన్నమల్లయ్య కేసులో హైకోర్టు కీలక తీర్పు

వార్త 2 days ago

CI Chinna Mallaiah: అత్యాచారం కేసు లో వినుకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) చిన్నమల్లయ్యకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఈ కేసులో కోర్టు ముందున్న ప్రాథమిక వివరాలు, ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ పొందే అర్హత లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also : AP FTVTDC: ఏపీ సినీ రంగానికి కొత్త కళ.. చైర్మన్‌గా భరత్ భూషణ్!

 High Court’s key verdict in CI Chinnamallaiah case

ఈ కేసు విచారణ లో ప్రాసిక్యూషన్ కోర్టు ముందు పలు కీలక ఆధారాలను ప్రవేశపెట్టింది. పిటిషనర్ చిన్నమల్లయ్య కుమారుడు శివశంకర్.. బాధితురాలికి నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు, అలాగే ఆమె మొబైల్‌కు పలు మెసేజ్‌లు పంపించినట్లు ప్రాసిక్యూషన్ ధర్మాసనానికి వివరించింది. ఈ ఆధారాలను హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. నిందితుడు పోలీస్ శాఖలో ఉన్నత అధికారి కావడం వల్ల, తన అధికారాన్ని ఉపయోగించి దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

CI Chinna Mallaiah: కోర్టు కీలక వ్యాఖ్యలు

పిటిషనర్ వెలుపల ఉంటే తన హోదాను అడ్డం పెట్టుకుని దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే కాకుండా.. బాధితురాలిని మానసికంగా ప్రభావితం చేసేందుకు, ఒత్తిడికి గురిచేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తు ప్రక్రియకు ఆటంకంగా మారుతుందని కోర్టు పేర్కొంది.

పల్నాడు జిల్లా, వినుకొండ మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ తనపై సీఐ చిన్నమల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు సీఐపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిన్నమల్లయ్య హైకోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha