Kishan Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించడానికే సీఎం రేవంత్ రెడ్డి తనపై, కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి జి.
కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తీవ్ర అభద్రతా భావం, అహంకారంతోనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

Read also:Heavy Rains Telangana: హైదరాబాద్‌లో కుండపోత వాన.. తెలంగాణలోని పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ!
నేను తెలంగాణ ప్రజలకే జవాబుదారీ.. రేవంత్ రెడ్డికి కాదు!
"ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ పెట్టిన భిక్ష కాదు. సికింద్రాబాద్, అంబర్‌పేట్ నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన నమ్మకం, వారి ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పుడు విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను కేవలం నా పార్టీకి, నన్ను నమ్మిన తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని" అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధిని, ఇక్కడి ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నట్లు సీఎం చేస్తున్న ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. "ముఖ్యమంత్రికి దమ్ముంటే తెలంగాణ అభివృద్ధిపై నాతో బహిరంగ చర్చకు రావాలి. ప్రెస్ క్లబ్ వేదికైనా సరే.. లేదా గన్ ఫౌండ్రీ లోని అమరవీరుల స్తూపం ముందైనా సరే నేను చర్చకు సిద్ధం" అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా తాను ఆపినట్లు నిరూపిస్తే.. తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టులతో నిష్పక్షపాత కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Kishan Reddy: అప్పుల తెలంగాణగా మార్చేశారు.. మెట్రో-2పై స్పష్టత
మెట్రో ఫేజ్-2, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుల విషయంలో సీఎం చేసిన విమర్శలను కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. హైదరాబాద్ మెట్రో రెండో విడత ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా (సూత్రప్రాయంగా) ఆమోదం తెలిపిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇక తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై అపాయింట్‌మెంట్ దొరకలేదంటూ రేవంత్ రెడ్డి రాజకీయాలు చేయడం మానేసి, బాధ్యతగల ముఖ్యమంత్రిగా పద్ధతి ప్రకారం అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరాలని సూచించారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతి, తప్పుడు విధానాల వల్లే ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను నేడు అప్పుల ఊబిలోకి నెట్టేశాయని కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

