CM Vijay Tamil Nadu : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తళపతి విజయ్ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు తీపి కబురు అందిస్తూ, కరువు భత్యం (DA) పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
60 శాతానికి పెరిగిన డీఏ
ప్రస్తుతం అమల్లో ఉన్న 58 శాతం డీఏను 60 శాతానికి పెంచుతూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఈ 2 శాతం అదనపు డీఏ, 2026 జనవరి 1వ తేదీ నుండి వర్తిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ఈ పెంపును త్వరితగతిన అమలులోకి తెచ్చారు.
16 లక్షల మందికి లబ్ధి.. భారీగా ఆర్థిక భారం
ఈ నిర్ణయం వల్ల తమిళనాడులోని సుమారు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు (CM Vijay Tamil Nadu) మరియు పెన్షనర్లకు నేరుగా ఆర్థిక వెసులుబాటు కలగనుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా 1,230 కోట్ల రూపాయల అదనపు భారం పడనున్నప్పటికీ, ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తగ్గకుండా నిధులు కేటాయించేందుకు విజయ్ ప్రభుత్వం సిద్ధమైంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

