Dailyhunt
సిలిండర్ కష్టాలకు చెక్.. ఇంటికే గ్యాస్ పైపులైన్!

సిలిండర్ కష్టాలకు చెక్.. ఇంటికే గ్యాస్ పైపులైన్!

వార్త 1 week ago

Karimnagar Pipeline Gas Connection: ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుక్ చేసిన నెల రోజులైనా సిలిండర్ అందక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం పైప్డ్‌ నేచురల్ గ్యాస్ (PNG) పంపిణీని వేగవంతం చేస్తోంది. ఇకపై సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ వంటింటికే గ్యాస్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Read also: Odisha Govt: బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేయొద్దు - ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

Home gas pipeline connection system

Karimnagar Pipeline Gas Connection: మూడు నెలల్లో కొత్త రూల్.. పీఎన్‌జీ ఇక తప్పనిసరి!

పైపులైన్ గ్యాస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. కనెక్షన్ అందుబాటులో ఉన్న చోట మూడు నెలల తర్వాత సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పైపులైన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే రామగుండం నుంచి కరీంనగర్ వరకు 20 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.

పైపులైన్ గ్యాస్‌తో లాభాలు.. భద్రతలోనూ నెంబర్ వన్!

ఈ కొత్త విధానం వల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సిలిండర్ అయిపోతుందనే టెన్షన్ ఉండదు మరియు వాడిన గ్యాస్ రీడింగ్ ఆధారంగానే బిల్లు చెల్లించవచ్చు. పీఎన్‌జీ గ్యాస్ గాలి కంటే తేలికైనది కావడంతో ప్రమాదాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే గోదావరిఖని, కృష్ణానగర్ ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు ఈ సౌకర్యాన్ని వాడుతూ సిలిండర్ల గొడవ వదిలించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం… తండ్రి, కొడుకు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha