Dailyhunt
సీమ అభివృద్ధిపై చంద్రబాబు నిర్లక్ష్యం: మాజీ మంత్రి రోజా

సీమ అభివృద్ధిపై చంద్రబాబు నిర్లక్ష్యం: మాజీ మంత్రి రోజా

వార్త 1 week ago

Roja Comments: తిరుపతిలో జరిగిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా వేదికలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, సీమ ప్రాజెక్టులకు కనీసం రెండు వేల కోట్లు కూడా కేటాయించకపోవడం దారుణమని ఆమె విమర్శించారు.

Read also: Pargi News:పరిగి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత: అప్పా జంక్షన్ వద్ద లారీలతో దిగ్బంధం

Chandrababu’s Neglect of Seema’s Development

Roja Comments: చీకటి ఒప్పందాల ఆరోపణలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ చర్యల వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని, ఇది ముమ్మాటికీ సీమ ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని ఆమె పేర్కొన్నారు.

వెన్నుపోటు రాజకీయాలపై విమర్శలు

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కిస్తూ చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని రోజా ధ్వజమెత్తారు. సొంత ప్రాంతం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, సీమ ప్రజలు ఈ వివక్షను గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha