Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింపతీ కోసం ఇంత దారుణమైన ప్లానా?

సింపతీ కోసం ఇంత దారుణమైన ప్లానా?

వార్త 4 days ago

Pastor Abhinay Darshan : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది.

తనపై గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారంటూ ఆయనే సృష్టించుకున్న ఈ కథ వెనుక అసలు నిజాలను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కేవలం ప్రజాదరణ, సానుభూతి (సింపతీ) కోసమే సొంతంగా ముందస్తు స్కెచ్ వేసి ఈ నాటకానికి తెరలేపినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.

‘భరోసా పార్టీ’ ప్రచారం.. సంచలన ఆరోపణలు

గత కొన్ని రోజులుగా ‘భరోసా పార్టీ’ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్న పాస్టర్ అభినయ్, తన కారుపై కొందరు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేశారని, ఆ దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ప్రచారం చేశారు. గతంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ లాగే తన్ను కూడా చంపేయడానికి కుట్ర పన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, దాడి జరుగుతున్నప్పుడు ప్రాణాలు రక్షించుకోకుండా ఓపిగ్గా వీడియోలు ఎలా తీశారంటూ తోటి పాస్టర్ల నుంచే వ్యతిరేకత రావడంతో పోలీసులు దీనిపై లోతుగా విచారణ జరిపారు.

Read also : MLA Lokam Naga Madhavi : మత్స్యకారులకు రూ.20,000 భృతి!

 Pastor Abhinay Darshan

ఆడియోలు, వాట్సాప్ చాటింగ్‌తో దొరికిపోయిన పాస్టర్

పోలీసుల దర్యాప్తులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అభినయ్ ఐదుగురు సభ్యులతో కలిసి ఈ ప్లాన్ వేసినట్లు తేలింది. తనపై దాడి ఎక్కడ జరగాలి? కారు అద్దాలు ఎలా పగలగొట్టాలి? శరీరంలో ఏ భాగాలపై ఎలా పొడవాలో క్లియర్ కట్‌గా వివరిస్తూ అభినయ్ పంపిన ఆడియో సందేశాలు, వాట్సాప్ చాటింగ్ ఆధారాలు బయటకు వచ్చాయి. నిందితుల్లో ఒకరి భార్యకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌ను ట్రాక్ చేయడం ద్వారా పోలీసులకు ఈ బలమైన ఆధారాలు లభించాయి. కేవలం రాజకీయ లేదా వ్యక్తిగత మైలేజ్ కోసం డ్రామా ఆడిన పాస్టర్ అభినయ్ ఇప్పుడు చట్టానికి చిక్కారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తిరుపతిలో రూ. కోటి విలువైన 500 మొబైల్ ఫోన్ల రికవరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha