Singer Jaan Kumar Sanu:ప్రముఖ గాయకుడు, 'బిగ్ బాస్ 14' కంటెస్టెంట్ జాన్ కుమార్ సాను కోవిడ్-19 బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు.
అయితే, ఈ విషయాన్ని ఆయన ఎంతో వినూత్నంగా, హాస్యాన్ని జోడిస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆసుపత్రి పడకపై నుంచే ఆదివారం నాడు ఒక వీడియోను విడుదల చేస్తూ తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు.
Read Also: Maa Inti Bangaram: ఓటీటీలోకి రాబోతున్న 'మా ఇంటి బంగారం'..ఎప్పుడంటే?
Singer John Kumar Sanu tests positive for COVID-19.
Singer Jaan Kumar Sanu: చైనా స్నేహితుడికి సలాం.. ఆసుపత్రి దుస్తులపై జాన్ సాను సెటైర్లు
ప్రముఖ నేపథ్య గాయకుడు కుమార్ సను కుమారుడైన జాన్ కుమార్ సాను.. ఈ బాధాకరమైన వార్తను కూడా కాస్త సరదాగా మార్చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. "చైనా నుంచి వచ్చిన నా స్నేహితుడా కోవిడ్‌కు సలాం చెయ్యి" అంటూ క్యాప్షన్ పెట్టారు. అంతేకాదు, తాను ధరించిన హాస్పిటల్ డ్రెస్ గురించి ప్రస్తావిస్తూ.. "ఫిట్ చెక్ - నాకు ఇష్టమైన డిజైనర్ కోకిలాబెన్ దుస్తులు ధరించాను. ఆసుపత్రిలో చేర్చింది మాత్రం వుహాన్ నుంచి వచ్చిన కోవిడ్" అంటూ సరదాగా రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై స్పందించిన అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తనకు లక్షణాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎంతకాలం ఆసుపత్రిలో ఉండాలనే విషయాలను ఆయన వెల్లడించలేదు.
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. అలర్ట్ అయిన అధికారులు
ఒకవైపు బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొత్తగా కోవిడ్-19 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో గత కొన్ని వారాలుగా ఎనిమిది యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు రోగులు చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. దీంతో అలర్ట్ అయిన జిల్లా యంత్రాంగం నిఘాను ముమ్మరం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించేందుకు ర్యాపిడ్-రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు సేకరించిన 40 నమూనాలలో 18 నెగటివ్‌గా తేలగా, మిగిలిన ఫలితాలు రావాల్సి ఉంది.
జీనోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు.. వైద్యుల సూచనలు
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ ఏంటో తెలుసుకోవడానికి, దాని తీవ్రతను అర్థం చేసుకోవడానికి అధికారులు కొన్ని నమూనాలను పూణేలోని ల్యాబొరేటరీకి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని, కోవిడ్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com
అభిమాని కన్నీళ్లు చూసి చలించిన విజయ్ దేవరకొండ..'నేనున్నా' అంటూ భరోసా

