Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగరేణి ఆసుపత్రుల్లో భారీ మార్పులు!

సింగరేణి ఆసుపత్రుల్లో భారీ మార్పులు!

వార్త 4 months ago

Bellampalli Singareni Hospital: బెల్లంపల్లి, మే 28, ప్రభాతవార్త: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.

కిరణ్ రాజ్ కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆసుపత్రిలో వార్డుల పరిశీలన

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులు, క్యాజువాలిటీ విభాగాలను పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆసుపత్రి సేవలపై సమీక్ష చేపట్టారు.త్వరలోనే బెల్లంపల్లి ఆసుపత్రిలో వైద్య నిపుణులు మరియు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read Also: Gold Medal in WC-2026 : ఇషా సింగ్ కు సీఎం రేవంత్ అభినందనలు

32 మంది వైద్యులు, 175 మంది సిబ్బంది నియామకం

సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంటర్వ్యూలు నిర్వహించామని, త్వరలోనే 32 మంది వైద్యులు మరియు 175 మంది సిబ్బందిని నియమించనున్నట్లు వెల్లడించారు.

కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

గోదావరిఖనిలో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్డియాలజీ క్యాథ్ ల్యాబ్ సెంటర్ ఏర్పాటు కోసం సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.

దీని ద్వారా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి నుండి భూపాలపల్లి వరకు సుమారు 1.80 లక్షల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని వివరించారు.

Bellampalli Singareni Hospital: ప్రత్యేక వైద్య శిబిరాలు త్వరలో

బెల్లంపల్లి ప్రాంతానికి ప్రతి నెలలో ఆరుగురు వైద్య నిపుణులు వారానికి ఒకరోజు క్యాంపులు నిర్వహిస్తున్నారని తెలిపారు. త్వరలో గుండె మరియు కంటి వైద్య నిపుణులు కూడా నెలలో రెండు రోజులపాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సేవలు అందించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పాండురంగ చారి పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రైతులకు జీలుగు, జనుము విత్తనాల పంపిణీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha