Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగరేణి కార్మికుల కష్టాలపై కిషన్ రెడ్డి ఫైర్!

సింగరేణి కార్మికుల కష్టాలపై కిషన్ రెడ్డి ఫైర్!

వార్త 3 weeks ago

Singareni:సింగరేణి బొగ్గు గనుల దుస్థితి గురించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ఈ సంస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబం ఈ సంస్థను తమ సొంత ఆస్తిలా మార్చుకుని ఇష్టారాజ్యంగా దోచుకున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రస్తుతం కార్మికులపై పడుతున్న ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన హామీ ఇచ్చారు.

Read also: KTR: కాళేశ్వరం వివాదంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్-బీజేపీపై తీవ్ర ఆరోపణలు

 The deplorable state of Singareni coal mines

కేసీఆర్ కుటుంబం దోపిడీతో వెనకబడిన సింగరేణి

భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, సింగరేణి కార్మికులు ప్రస్తుతం తీవ్ర కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో సంస్థ 15 ఏళ్లు వెనకబడిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పరిస్థితులు ఏమాత్రం మారలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంస్థ అభివృద్ధి కోసం కేంద్రంతో ఒక్కసారి కూడా చర్చించలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం లాగే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా సింగరేణిని తమకు అనుకూలంగా మార్చుకుని దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Singareni:ఆర్థిక భారం పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వాల తీరు

దేశ ఆర్థిక వ్యవస్థలో బొగ్గు కీలకం, అయితే సింగరేణి సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ హయాంలో రూ. 8,958 కోట్ల అప్పులు ఉండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అది రూ. 26,875 కోట్లకు పెరిగిందని ఆయన వివరించారు. సంస్థ బాగు కోసం కాకుండా, అప్పుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాణ్యమైన బొగ్గు సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తూ, నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

Epaper: epaper.vaartha.com

తెలంగాణ టెట్ ఫలితాల్లో షాక్..14 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha