Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగూర్ ప్రాజెక్టుకు దిగువకు నీటి విడుదల

సింగూర్ ప్రాజెక్టుకు దిగువకు నీటి విడుదల

వార్త 2 months ago

Singur Project Water Release: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి నేడు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. శనివారం రాత్రి నుంచి దిగువనున్న మంజీరా నదిలోకి నీటిని గేట్లు ఎత్తి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రాజెక్టు నుంచి సుమారు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వేసవికాలం దృష్ట్యా దిగువ ప్రాంతాల్లో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

Read Also:Hyderabad Road Accident: బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి!

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha