Syria Damascus Explosion : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సిరియా పర్యటనలో ఉండగా ఆ దేశ రాజధాని డమాస్కస్‌లో వరుస బాంబు పేలుళ్లు సంభవించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.
సిరియా కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో సమావేశం కావడానికి మెక్రాన్ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. మెక్రాన్ బస చేసిన ప్రసిద్ధ ‘ఫోర్ సీజన్స్ హోటల్’ సమీపంలోని రద్దీ వీధిలో ఈ పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ ప్రమాదం నుండి ఫ్రాన్స్ అధ్యక్షుడు సురక్షితంగా బయటపడ్డారని, ఇరు దేశాధినేతల చర్చలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది.
Read Also: Iran-America War : ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు..రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు
Syria Damascus Explosion :
Syria Damascus Explosion : పేలుళ్ల వివరాలు మరియు నష్టం
డమాస్కస్ నడిబొడ్డున ఉన్న ఒక చెత్తబుట్టలో, అలాగే రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో పేలుడు పరికరాలను (IEDs) అమర్చి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురు పోలీసు అధికారులతో సహా నలుగురు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పేలుడు ధాటికి సమీపంలోని ఒక వ్యాన్, మోటార్‌సైకిల్ పూర్తిగా అగ్నిఆహుతయ్యాయి. 2024లో సుదీర్ఘ కాలం పాలించిన బషర్ అల్-అసద్ పాలనను తిరుగుబాటు ద్వారా కూలదోసి అహ్మద్ అల్-షరా అధికారంలోకి వచ్చారు. ఒకప్పుడు అల్-ఖైదాతో సంబంధాలున్న ‘హయత్ తహ్రీర్ అల్-షమ్’ ఉగ్రవాద ముఠాకు నాయకత్వం వహించిన అల్-షరా, ప్రస్తుతం ఇస్లామిక్ ప్రభుత్వ విధానాలను మార్చుకుంటూ పాశ్చాత్య దేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

