Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిత్రం కాకపోతే మరేంటి? పెట్రోల్ కోసం ఏకంగా 'బైక్ ట్యాంక్' పట్టుకొచ్చాడు!

సిత్రం కాకపోతే మరేంటి? పెట్రోల్ కోసం ఏకంగా 'బైక్ ట్యాంక్' పట్టుకొచ్చాడు!

వార్త 3 months ago

Petrol Viral Video: దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో బంకుల వద్ద జనం క్యూ కడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండలేక కొందరు కొత్త దారులను వెతుక్కుంటున్నారు.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

Read Also:Karnataka Crime: బహిరంగంగా భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

ఏం జరిగిందంటే?

పెట్రోల్ బంకుల్లో సాధారణంగా ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పోయడం నిషిద్ధం. ఒకవేళ బండిలో పెట్రోల్ అయిపోతే, వాహనాన్ని తోసుకుంటూ బంకు వరకు రావాలి. కానీ, ఆ వ్యక్తికి అంత ఓపిక లేకపోయింది. తన బైక్ మొత్తాన్ని తోసుకుని రావడం కంటే, కేవలం 'పెట్రోల్ ట్యాంక్' ఒక్కదాన్నే విడదీసి చేత్తో పట్టుకొచ్చాడు. బంకులో బండి ట్యాంక్ చూసి అటెండెంట్ కూడా షాక్ అయ్యాడు. కానీ అది వాహనానికి సంబంధించిన ట్యాంకే కావడంతో కాదనలేక పెట్రోల్ కొట్టాడు.

వైరల్ అవుతున్న వీడియో

ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. "ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్" అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. పెట్రోల్ కొరత వేళ జనం పడుతున్న ఇబ్బందులు ఒకవైైపు ఉంటే, ఇలాంటి 'సిత్రాలు' చూసి మరికొందరు నవ్వుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

నిర్మలమ్మ కీలక ప్రకటన.. డీజిల్ ఎగుమతులపై భారీ సుంకాలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha