Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోమనాథ్ ఆలయ 75వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని

సోమనాథ్ ఆలయ 75వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని

వార్త 3 months ago

Gujarat News: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్‌లో అమృత్ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.

ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. మోదీ రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఈ వేడుకలు భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీకగా నిలిచాయి.

Read also: Uttar Pradesh Crime: ఆస్తికోసం తల్లిని, తమ్ముడిని కాల్చి చంపిన అన్న

 Somnath Temple 75th anniversary view

Gujarat News: జనసంద్రాన్ని తలపించిన భారీ రోడ్ షో

ఆలయానికి వెళ్లే ముందు ప్రధాని సోమనాథ్ వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ప్రజలు నీరాజనాలు పట్టారు. వివిధ రాష్ట్రాల కళాకారులు తమ ప్రదర్శనలతో రోడ్ షోలో సందడి చేశారు. జై సోమనాథ్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ ప్రయాణంలో మోదీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

11 పుణ్యక్షేత్రాల జలాలతో పవిత్ర కుంభాభిషేకం

ఆలయంలో మోదీ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు ధ్వజ పూజ నిర్వహించారు. దేశంలోని ప్రధాన 11 పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆకాశం నుండి హెలికాప్టర్లు ఆలయంపై పూల వర్షం కురిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1951లో ప్రారంభమైన ఈ ఆలయ వైభవాన్ని చాటిచెప్పేలా వేడుకలు సాగాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

SIR వల్లే బెంగాల్ లో బీజేపీకీ భారీ మెజార్టి: శశిథరూర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha