Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సొంత పార్టీ నేతలే మీనాక్షిని దెబ్బకొట్టారు.. మధ్యప్రదేశ్ సీఎం

సొంత పార్టీ నేతలే మీనాక్షిని దెబ్బకొట్టారు.. మధ్యప్రదేశ్ సీఎం

వార్త 2 days ago

CM Mohan Yadav: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నామినేషన్ తిరస్కరణ వెనుక ఎలాంటి బాహ్య శక్తులు లేవని, ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుట్ర అని ఆయన అరోపించారు. ఆమె వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులే వ్యూహాత్మకంగా ఈ నామినేషన్‌ను అడ్డుకున్నారని సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Ahmedabad Air India Crash Anniversary : అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి నేటికీ ఏడాది..

 CM Mohan Yadav makes sensational remarks on the rejection of Meenakshi Natarajan’s nomination.

CM Mohan Yadav: సొంత పార్టీ నేతలే దెబ్బకొట్టారు

ఈ వ్యవహారంపై సీఎం మోహన్ యాదవ్ మరింత లోతుగా స్పందిస్తూ ఆసక్తికర అంశాలను తెరపైకి తెచ్చారు. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న సమయం నుంచి అక్కడి స్థానిక నాయకుల్లో కొందరికి ఆమెపై తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమెను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సొంత పార్టీ నాయకులే తెరవెనుక పక్కా ప్లాన్ వేశారని ఆరోపించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కాంగ్రెస్ సంస్కృతి అని, అందులో భాగమే ఈ అంతర్గత రాజకీయ కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు.

ఈ కుట్రకు సంబంధించి కొన్ని నమ్మశక్యం కాని విషయాలను మోహన్ యాదవ్ వెల్లడించారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రహస్యంగా బెంగుళూరుకు తరలించేందుకు ఒక పెద్ద ప్లాన్ సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో చార్టెడ్ ఫ్లైట్ ఆలస్యం కావడం వల్ల ఆ ప్లాన్ కాస్తా బెడిసికొట్టింది. ఆ అంశాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కుట్ర అని ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది అని సీఎం మోహన్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. తప్పు తమ వైపు పెట్టుకుని ఇతరులపై నిందలు వేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

మమతను వీడిన TMC రెబల్ MPలు ఎవరంటే ..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha