Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే సాధ్యం

సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే సాధ్యం

వార్త 3 weeks ago

Mahabubnagar Indiramma Houses: గత ప్రభుత్వంలో హామీలకే పరిమితం..నేడు పేదల కండ్లల్లో ఆనందం చూస్తున్నాం..మహబూబ్ నగర్ నగరం, ఎదిర డివిజన్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్దిదారులకు గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు.

Read Also: Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు చూస్తే బిగ్ బాస్ షో చూస్తున్నట్టుంది: బండి సంజయ్

 Realizing the dream of owning a home is possible only with the Congress.

Mahabubnagar Indiramma Houses: పేదల కలలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కల సాకారం కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సొంతింటి హామీలు మాటలకే పరిమితమై, పేదల కలలు కలగానే మిగిలిపోయాయని విమర్శించారు. ఉత్తితి హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నిజం చేస్తోందని అన్నారు. నిర్మిస్తున్న ఇళ్లు కేవలం గోడల సముదాయం కాదని, అవి పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు.

భవిష్యత్తులో గుడిసెలు లేని గ్రామాల నిర్మాణం

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని ఆయన చెప్పారు. ప్రతి పేద కుటుంబం సంతోషంగా జీవించేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో గుడిసెలు లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేద ప్రజలకు అండగా నిలిచి వారికి సేవ చేస్తుందని, కావున ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, కార్పొరేటర్ లలిత భానుచందర్ ,స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

కాసేపట్లో ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha