Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియాలోకి నారా దేవాన్ష్ ఎంట్రీ.. టీజర్‌లో మెరిసిన నారా లోకేష్!

సోషల్ మీడియాలోకి నారా దేవాన్ష్ ఎంట్రీ.. టీజర్‌లో మెరిసిన నారా లోకేష్!

వార్త 6 days ago

Nara Devansh YouTube channel: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనయుడు, నారా దేవాన్ష్ సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దేవాన్ష్ Dino Deets పేరుతో తన స్వంత యూట్యూబ్ ఛానల్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఛానల్ ప్రారంభం సందర్భంగా నారా-నందమూరి కుటుంబ సభ్యులు దేవాన్ష్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన టీజర్‌లో తండ్రి నారా లోకేష్ కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్ ప్రత్యేకతలు, దేవాన్ష్ ఎంచుకున్న అంశాల గురించి లోకేష్ అడిగి తెలుసుకుంటున్నట్లు ఈ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. దేవాన్ష్ సృష్టించిన ఈ ప్రపంచంలోకి ఒక ప్రేక్షకుడిగా ప్రవేశించడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు లోకేష్ ట్విట్టర్ (X) వేదికగా పేర్కొన్నారు.

Nara Devansh YouTube channel: డైనోసార్ల వింతలు, విశేషాలే కాన్సెప్ట్

దేవాన్ష్ ప్రారంభించిన Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా డైనోసార్లు, శిలాజాలు ,పురాతన అవశేషాల చుట్టూ సాగనుంది. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన డైనోసార్ల గురించిన వింతలు, ఆశ్చర్యపరిచే నిజాలను దేవాన్ష్ తన పాడ్‌కాస్ట్‌ల ద్వారా వివరించనున్నారు. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునేలా, నవ్విస్తూ, ఆలోచింపజేసే వినోదాత్మక శైలిలో ఈ కంటెంట్ ఉండబోతోందని సమాచారం.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాందించిన దేవాన్ష్

యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తగా పరిచయమైన దేవాన్ష్ కేవలం చదువులోనే కాదు, ఆటల్లోనూ తన ప్రతిభను చాటాడు. చెస్ లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పూర్తి చేసి 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా గతేడాది దేవాన్ష్ 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకున్నాడు.ఇప్పుడు అదే చురుకుదనంతో సరికొత్త పాడ్‌కాస్ట్‌తో డిజిటల్ మీడియాలో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అడవి పంది దాడి.. ముగ్గురికి గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha