Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పెషల్ బస్సులు నడపాలని విద్యార్థుల ధర్నా

స్పెషల్ బస్సులు నడపాలని విద్యార్థుల ధర్నా

వార్త 1 week ago

Sangareddy news: పాఠశాల, కళాశాల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం బెల్లాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

బాధలగామ, బెల్లాపూర్, పులుకుర్తి, దోసపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

Read Also : IT Employee Suicide : హైదరాబాద్‌లో తీవ్ర విషాదం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద ఆత్మహత్య

 Students protest to run special buses

Sangareddy news: విద్యార్థుల డిమాండ్లు, ఆందోళన

నారాయణఖేడ్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో పులుకుర్తి వరకు ప్రత్యేక బస్సులు నడిపించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బస్సుల సౌకర్యం లేకపోవడంతో పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు.

సమాచారం అందుకున్న మనూర్ ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో సంప్రదించి విద్యార్థుల సమస్యను వివరించారు. పాఠశాల, కళాశాల సమయాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సు నడిపించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ ధర్నాను విరమించారు.

రైతుల కష్టాలు కనపడవా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha