PBKS IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ సిక్సర్లు, పరుగుల వరదతో సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. ముఖ్యంగా బ్యాటర్ల వీరవిహారంతో స్కోరు బోర్డులు పరుగులెడుతున్నాయి.
ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పేరిట ఉన్న ఒక భారీ రికార్డును పంజాబ్ కింగ్స్ (PBKS) సమం చేయడంతో పాటు, లీగ్ చరిత్రలోనే అత్యధిక సెంచరీల రికార్డు కూడా ఈ సీజన్‌లో రిపీట్ అయింది.
సన్‌రైజర్స్ రికార్డుపై పంజాబ్ పంజా
ఈ ఐపీఎల్ సీజన్ అంతటా పరుగుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. లీగ్ హిస్టరీలోనే ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 200 పైగా పరుగులు చేసిన జట్టుగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సరసన ఇప్పుడు పంజాబ్ కింగ్స్ చేరింది. ప్రస్తుత సీజన్లో ఎస్‌ఆర్‌హెచ్ భీకర ఫామ్‌తో ఇప్పటివరకు 9 సార్లు 200 ప్లస్ స్కోరును నమోదు చేయగా, పంజాబ్ కింగ్స్ కూడా అదే స్థాయిలో చెలరేగి 9 సార్లు 200 మార్కును అందుకొని రికార్డును సమం చేసింది. పంజాబ్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందిపుచ్చుకున్న ఫామ్ కారణంగానే ఆ జట్టు ఈ ఫీట్ సాధించగలిగింది. లీగ్ దశ ముగిసేలోగా ఈ రెండు జట్లలో ఏది మరోసారి 200+ మార్కు దాటినా, ఐపీఎల్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు ఆ జట్టు ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also : గెలిచినా దక్కని రెండో స్థానం.. 18 పాయింట్లతో మూడో ప్లేస్‌కు పరిమితం!
2024 ఆల్‌టైమ్ రికార్డు సమం
ఈ సీజన్ కేవలం భారీ స్కోర్లకే పరిమితం కాలేదు, వ్యక్తిగత మైలురాళ్లతోనూ హోరెత్తిపోతోంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో నమోదైన అత్యధిక వ్యక్తిగత సెంచరీల రికార్డు ఈసారి లీగ్ దశ పూర్తి కాకముందే సమమవడం విశేషం. గతంలో 2024 సీజన్లో బ్యాటర్లు మొత్తం 14 సెంచరీలతో రికార్డు సృష్టించగా, ప్రస్తుత 2026 సీజన్లో ఇంకా లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అప్పుడే 14 శతకాలు నమోదయ్యాయి. పిచ్‌ల అనుకూలత, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, మరియు బ్యాటర్ల మైండ్ సెట్ మారడం వల్లే సెంచరీల వరద పారుతోందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను కూడా లెక్కలోకి తీసుకుంటే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు నమోదైన లీగ్‌గా 2026 సీజన్ సరికొత్త చరిత్ర సృష్టించడం కేవలం కొన్ని మ్యాచ్‌ల దూరంలోనే ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

