Warangal ACB Arrest: వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్లు జమాలపురం రామనర్సింహారావు మరియు దావులూరి ఆనంద్ ప్రైవేటు వ్యక్తుల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది.
డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా వాడుకుంటూ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు.
Read also: Kamareddy Bus Accident: డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి!

ACB officers investigating bribery case
Warangal ACB Arrest: డిజిటల్ సాక్ష్యాలతో దొరికిపోయిన అధికారులు
ఈ అవినీతి నెట్వర్క్ ఎంత పక్కాగా సాగుతుందో ఏసీబీ సేకరించిన ఫోన్ డేటా ఆధారంగా స్పష్టమైంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే సుమారు రూ. 16.23 లక్షల వసూళ్లు జరిగినట్లు వారి ఫోన్లలోని వాట్సాప్ చాట్లు మరియు ఫోన్ పే లావాదేవీలు నిరూపించాయి. నిందితుడు ఆనంద్ ఖాతాలో రూ. 44.28 లక్షల అక్రమ లావాదేవీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టెక్నాలజీని వాడుకుంటూ లంచాలు తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.
బినామీ ఆస్తులు, అక్రమ కొనుగోళ్లు
లంచం సొమ్ముతో హన్మకొండలోని ప్రముఖ టవర్స్‌లో సుమారు రూ. 72 లక్షల విలువైన వాణిజ్య స్థలాలను కొనుగోలు చేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. కుటుంబ సభ్యుల పేరిట ఈ ఆస్తులను రిజిస్టర్ చేయించినట్లు ఆధారాలు లభించాయి. కార్యాలయంలో దొరికిన అక్రమ నగదుతో పాటు, నిందితుల ఆస్తులపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటి వారైనా వదిలేది లేదని, ప్రజలు 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

