Dailyhunt
'టాక్సిక్' లో బోల్డ్ సీన్ల రచ్చ.. సీన్లు కట్ చేయాల్సిందే అంటున్న కియారా!

'టాక్సిక్' లో బోల్డ్ సీన్ల రచ్చ.. సీన్లు కట్ చేయాల్సిందే అంటున్న కియారా!

వార్త 6 days ago

Kiara Advani: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'టాక్సిక్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన హీరోయిన్ కియారా అద్వానీ కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కథా డిమాండ్ మేరకు చిత్రీకరించిన కొన్ని బోల్డ్ ,ఇంటిమేట్ సీన్లు వెండితెరపై మరీ ఎక్కువగా ఉన్నాయని ఆమె భావిస్తున్నారట.

Read Also:Shiman Mandanna Birthday: చెల్లెలి పుట్టినరోజున రష్మిక ఎమోషనల్ పోస్ట్

 Kiara Advani Toxic Movie

Kiara Advani: ఇమేజ్ దెబ్బతింటుందనే భయం

ప్రస్తుతం కియారా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తనను రిసీవ్ చేసుకునే విధానం మారుతుందని భావించి, ఆ సీన్లను పూర్తిగా తొలగించాలని లేదా కనీసం వాటి నిడివిని అయినా తగ్గించాలని ఆమె దర్శకురాలిని కోరినట్లు టాక్. అయితే దర్శకురాలు మాత్రం, ఆ సీన్లు కథలో అంతర్భాగమని, వాటిని తీసేస్తే సినిమా ఇంపాక్ట్ తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ‘టాక్సిక్’ టీమ్ కియారా రిక్వెస్ట్‌ను మన్నిస్తుందా లేదా అనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha