Dailyhunt
టాస్ గెలిచిన హార్దిక్ సేన

టాస్ గెలిచిన హార్దిక్ సేన

వార్త 1 week ago

MI vs CSK Live: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య పోరుకు వాంఖడే స్టేడియం వేదికైంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు.

దీంతో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది.

Read Also:Mukesh Choudhary: తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టులోకి ముకేశ్ చౌదరి!

MI vs CSK Live: ఆయుష్ మ్హాత్రే స్థానంలో ఎవరు?

ముంబై యువ సంచలనం ఆయుష్ మ్హాత్రే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆయన స్థానాన్ని భర్తీ చేసే రేసులో ఉర్విల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఉర్విల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఏకంగా 244 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి సెంచరీ కూడా బాదాడు. నేడు ముంబై తరఫున ఆయన ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం మెండుగా ఉంది.

 MI vs CSK Toss Result IPL 2026

జట్ల బలబలాలు

ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్‌లో ఉండటం ప్లస్ పాయింట్. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జట్టు సమతూకంతో ఉంది. బుమ్రా బౌలింగ్‌లో ఎప్పటిలాగే వికెట్లు తీస్తున్నాడు. ఇక చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ బ్యాటింగ్ పైన అంతా ఆధారపడి ఉంది. శివమ్ దూబే మిడిల్ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించగలడు. బౌలింగ్‌లో నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్ కీలక పాత్ర పోషించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కార్టూన్లతో రిలాక్స్ అవుతా.. బ్యాటింగ్ అదరగొడతా! వైభవ్ సూర్యవంశీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha