French labor organization : భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రెంచ్ కార్మిక అధికారులు భారీ షాకిచ్చారు. సమయ నమోదు (Time-recording) వ్యవస్థ ఫ్రెంచ్ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో సుమారు రూ.
2 కోట్ల (175,000 యూరోలు) జరిమానా విధించారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రాంతీయ కార్మిక సంస్థ DRIEETS Ile-de-France ఈ చర్యలు చేపట్టింది. ఈ జరిమానా వసూలుకు సంబంధించిన సమాచారం అందిందని.. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడిస్తున్నామని ఇన్ఫోసిస్ తాజా ప్రకటనలో తెలిపింది.
Read Also: NEET Paper Leak Protest: జంతర్ మంతర్ వద్ద చిగురించిన ప్రేమ.. పెళ్లి పీటలెక్కిన జంట!
French labor organization
French labor organization : రెగ్యులేటర్ జరిపిన పరిశోధనల ప్రకారం..
ఇన్ఫోసిస్ ఉపయోగిస్తున్న టైమ్-ట్రాకింగ్ వ్యవస్థ విశ్వసనీయత, ఆడిట్ చేయదగిన రికార్డులను నిర్వహించగల సామర్థ్యం, కొంతమంది ఉద్యోగులను పర్యవేక్షించే తీరుపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. ఫ్రెంచ్ కార్మిక నిబంధనల ప్రకారం.. యజమానులు చట్టబద్ధమైన 35-గంటల పనివారం, ఓవర్‌టైమ్, తప్పనిసరి విశ్రాంతి సమయాలను కచ్చితంగా నమోదు చేయాలి. ఈ రికార్డులు ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీకి (ఆడిట్‌కు) వీలుగా ఉండాలి. అయితే ఈ లోపాల వల్ల ఏయే వర్గాల ఉద్యోగులు ప్రభావితమయ్యారు లేదా ఈ వ్యవస్థలో ఎలాంటి నిర్దిష్ట మార్పులు చేయాలని కోరారనేది కంపెనీ ఫైలింగ్‌లో స్పష్టం చేయలేదు. దీని ప్రభావం తమ ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై పెద్దగా ఉండదని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ సమాచారాన్ని సమీక్షిస్తున్నామని, తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని పేర్కొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

