Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తలసేమియా బాధితుల కోసం సిద్దిపేటలో 2కె రన్

తలసేమియా బాధితుల కోసం సిద్దిపేటలో 2కె రన్

వార్త 3 months ago

Blood Donation: తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోండి.. మిత్ర బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 2కె రన్. 2 కె రన్ నిర్వహిస్తున్న డాక్టర్ల బృందం.. మిత్ర బ్లడ్ బ్యాంక్ సభ్యులు తల సేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకొని రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మిత్ర బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు వేణు గోపాల్ చారి అన్నారు.

అర్హులైన వారు రక్తదానం చేయాలని శుక్రవారం మిత్ర బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సిద్ధిపేట లోని పాత బస్టాండ్ నుండి డిగ్రీ కళాశాల గ్రౌండ్ వరకు టు కే రన్ నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వ్యాధి జన్యుపరమైన వ్యాధిగా వస్తూ ఉంటుంది దీనికి అనేక రకాలు కారణాలు ఉంటాయన్నారు.

Read also: Sangareddy News: పాల ఉత్పతి లేకుంటే మనుగడ కష్టం..జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Blood Donation: మేనరికం పెళ్లిళ్లతోనే జన్యుపరమైన సమస్యలు

ప్రధానంగా మేనరికం పెళ్లిళ్లు జన్యుపరమైన సమస్యలు ఉన్నవారితో పెళ్లిళ్లు తగ్గించేలా చూస్తే ఇటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. ఇటువంటి వ్యాధి సోకిన వారికి జీవితాంతం బ్లడ్ ఎక్కిస్తూనే ఉండాలని ప్రతి 20 రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కిస్తేనే వారు బతికే అవకాశం ఉంటుందని అన్నారు. కాబట్టి రక్త దాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు భాస్కర్, గణేష్, సాయిరాం, భీమేష్, రమేష్, నాగస్పందన, శ్రీపతి, విష్ణువర్ధన్, రన్నర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు, ఆస్పటల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు ఇమ్రాన్, నాగరాజు, వాకర్ అసోసియేషన్ సభ్యులు, మిత్రబ్యాంక్ సిబ్బంది, వ్యాధిగ్రస్తుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కోర్పోలులో దాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha