Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'తల్లికి వందనం' నిధుల పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

'తల్లికి వందనం' నిధుల పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వార్త 2 months ago

Talliki Vandanam Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీపి కబురు అందించారు.

నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అత్యంత ప్రతిష్టాత్మకమైన 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలపై స్పష్టతనిచ్చారు.

Read Also:MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ను కట్టడి చేయండి ప్రజాదర్బార్ లో హర్షవీణ

జూన్ నెలలోనే నిధుల విడుదల

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పథకం నిధులను పాఠశాలలు పున: ప్రారంభమయ్యే జూన్ నెలలోనే విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు.జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచే రోజే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ప్రతి విద్యార్థికి రూ. 15,000 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఇందులో రూ. 2,000 స్కూల్/కాలేజీ నిర్వహణ నిధికి మినహాయించి, నికరంగా రూ. 13,000 నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.

 Talliki Vandanam Funds Release AP 2026

Talliki Vandanam Scheme: పథకం అర్హతలు, నిబంధనలు

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులు.విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి.తల్లి పేరుతో బ్యాంక్ ఖాతా ఉండాలి. ఒకవేళ తల్లి లేని పక్షంలో తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాకు నిధులు అందుతాయి.నగదు బదిలీ సజావుగా సాగాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం (NPCI Linking) ఖచ్చితంగా ఉండాలి.

గతేడాది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం డబ్బులను ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తే.. కూటమి ప్రభుత్వం హయాంలో 84.27శాతం మందికి పథకం నిధులు అందచేసినట్లు గతంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు.

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also:

    'ఆహారభద్రత'ను హరిస్తున్న యుద్ధం!

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha