Dailyhunt
తల్లిపాల నిధితో చిన్నారులకు పునర్జన్మ: జిల్లా కలెక్టర్

తల్లిపాల నిధితో చిన్నారులకు పునర్జన్మ: జిల్లా కలెక్టర్

వార్త 2 weeks ago

ప్యాశ్చురైజేషన్ చేపట్టి నిల్వ ఉంచిన తల్లి పాలను డాక్టర్ల సూచన మేరకు చిన్నారులు అందిస్తున్నారు

Tirupati: తల్లిపాలు స్వీకరించడం ఇవ్వడం రెండు ఉచితమే ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల నందు రోటరీ క్లబ్ తిరుపతి వారి ద్వారా తల్లిపాల నిధి ఏర్పాటు చేసి తల్లిపాలు లేని చిన్నారులకు ఆరోగ్యవంతమైన తల్లిపాలను అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

శుక్రవారం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు ఏర్పాటుచేసిన రోటరీ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిల్క్ బ్యాంకు ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోటరీ హ్యూమన్ మిల్క్ క్లబ్ ఏర్పాటు చేసి తల్లిపాలు లేని పిల్లలకు తల్లిపాలన అందించి ఆ కొరతను తీరుస్తున్నారని పేర్కొన్నారు. సేకరించిన తల్లిపాలను పాశ్చురైజషన్ చేసి నిల్వ ఉంచి శిశువులకు అందించడం జరుగుతుందన్నారు.

Read Also:AP Govt Schemes: ఏప్రిల్ 1 నుండి ఉచిత విద్యుత్ అమలు!

తల్లిపాలను సేకరించి శిశువులకు అందించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. హ్యూమన్ మిల్క్ బ్యాంక్ సేవలు విస్తృతపరచి మధ్యతరగతి తల్లలు కూడా ఇచ్చే విధంగా, ప్రోత్సహం చేయాలని సలహా సూచనలు ఇచ్చారు. ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకు కఠిన మైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు, హ్యూమన్ మిల్క్ బ్యాంకు నందు గత సంవత్సరo కంటే ఈ సంవత్సరo లో ఎక్కువ సేవలు అందించినందులకు రోటరీ క్లబ్ అధికారులను,హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ తో పాటు వైద్యధికారులను, నర్సింగ్ సిబ్బందికి అభినందనలు తెలియచేసారు. బ్లడ్ డొనేషన్ బ్యాంక్ నిర్వహించడానికి 20 సం” క్రితం చాలా అపోహలు ఉండేవని, ప్రస్తుతం బ్లడ్ డొనేషన్ కూడా చాలా వరకు 70% నుండి 80% వరకు డిమాండ్ వున్నదన్నారు.

Tirupati: అనుబంధ ఆహారం తో పాటు తల్లి పాలు కొనసాగిoచ వచ్చు

అలాగే ప్రస్తుతం భారతదేశంలో 10 సం “నుంచి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గత 5 -6 సంవత్సరాల నుండి ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ లు వివిధ రాష్ట్రాలైన తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మొదలగు రాష్ట్రాలలో విస్తరణ చెందాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వైజాక్, కాకినాడ, విజయవాడ, అనంతపురం, తిరుపతి లో ఉన్నాయని, తిరుపతి లో ఎనలైజర్ తో కూడిన హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఉన్నందున, తల్లి పాలను కలెక్షన్ చేయుట, నిల్వ చేయుట, శుద్ధి చేయుట మరియు శిశువులకు తల్లి పాలు ఇవ్వుట జరుగుతున్నదన్నారు. తల్లికి పాలు పడక పోతే, అకాలoగా పుట్టిన పసి బిడ్డలకు బరువు తక్కువ బిడ్డలకు ఈ పాలు ఇస్తారన్నారు.

అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాతనే పిల్లలకు పాలను అందిస్తారు కాబట్టి శిశువులకు ఇన్ఫెక్షన్ రాదన్నారు. శిశువులకు మంచి పోషణ, అభివృద్ధి, వ్యాధులు నుండి రక్షణ కలుగుతుందన్నారు. తల్లిపాలు శిశువుకు తగిన శక్తి, వేడి, బిడ్డకు కావలసిన తగిన నీరు అందించడంతో పాటు సులభంగా జీర్ణం అవుతాయన్నారు. కావున ప్రతి తల్లి, పుట్టిన శిశువుల కు తల్లి పాలనే ఇవ్వాలని, మరియు తల్లి పాలనే 6 నెలలు వరకు కొనసాగించాలని, తద్వారా కూడా బిడ్డ కు అనుబంధ ఆహారం తో పాటు తల్లి పాలు కొనసాగిoచ వచ్చని తెలియచేశా రు.

మహిళలు ఉద్యోగ రీత్యా శిశువులకు అందుబాటులో లేకపోవుట

ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు ద్వారా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకు ద్వారా చాలా మంది 8,288 శిశువులకు పాలు అందించడం జరిగిందని, లబ్ది పొందారని వీటి వలన 50% వరకు నవజాత శిశువు మరియు సంవత్సర”లోపు శిశు మరణాలను తగ్గించి, శిశువుల ఆరోగ్యాన్ని పెంపొందించినట్లు తెలిపారు. పాశ్చత్య దేశాల్లో మహిళలు ఉద్యోగ రీత్యా శిశువులకు అందుబాటులో లేకపోవుట వలన ముందుగా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకులు నిర్వహించడం జరిగిందని మరియు ప్రీ టర్మ్ బేబీస్, లో బర్త్ బేబీస్, తీవ్రఅనారోగ్యo తో వున్న శిశువులకు పాశ్చరైజ్ చేసిన దాతల పాలు అందించడం లో చాలా కీలకం.

 Rotary Human Milk Bank

ఈ పాలు నెక్రో టైజింగ్ ఏంటరోకోలైటీస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్థాయి. తల్లి పాలు అందుబాటులో లేనప్పుడు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కు ఇవి సహాయపడుతాయు. ప్రతి రోజు తిరుపతి లో ఒకటి /రెండు వీదులలో హ్యూమన్ మిల్క్ బ్యాంకు గురించి అవగాహన కల్పించాలని, హ్యూమన్ మిల్క్ ని సేకరించుట కొరకు అవసరమైన తగిన సదుపాయాలు కల్పించుట కొరకు అవసరం మేరకు స్టేట్ హెల్త్ ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ వారితో మాట్లాడి కావలసిన వసతులు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రమీలదేవి మాట్లాడు హ్యూమన్ మిల్క్ బ్యాంకు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, తిరుపతి నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు.

చాలా సంతోషం

తిరుపతి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజేంద్ర శెట్టి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటగా ఎనలైజర్ తో కూడిన రోటరీ తల్లి పాల నిధి 3వ తేదీ ఏప్రిల్ 2024 సం. లో ఈ వైద్యశాలలో 35 లక్షల రూ. తో రోటరీ గ్లోబల్ గ్రాంట్ మరియు రోటరీ క్లబ్ తిరుపతి మరియు రోటరీ క్లబ్ అఫ్ గ్రీన్ టిన్ మలేషియా సంయుక్తముగా నిర్వహించడం మరియు సేవలు అందిచడం చాలా సంతోషం అని తెలిపారు. అమర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా రమాదేవి మాట్లాడుతూ తల్లి పాలు దానం చేసిన ప్రతి తల్లికి అభినందనలు తెలిపారు. రోటరీ మిల్క్ బ్యాంక్ చైర్మన్ దామోదరమ్ గత 2 సం.. రాలుగా సేకరించిన తల్లి పాలు, అందించిన శిశువు వివరాలు తెలియచేసారు.

ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా శ్రీహరి, డి ఎం అండ్ హెచ్ ఓ డా బాలకృష్ణ నాయక్, రుయా మెడికల్ సూపరింటెండెంట్ డా మనోహర్, ఎస్వీ మెడికల్ కాలేజ్ పీజీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డా కిరీటి వైస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, తదితరులు పాల్గొన్నారు. తల్లి పాలు దానం చేసిన తల్లులు వారి కుటుంబ సభ్యుల కు రోటరీ క్లబ్, తిరుపతి వారి తరపున ప్రతి ఒక్కరికీ శాలువా, మెమెంటో, సర్టిఫికెట్స్ ను కలెక్టర్ వారి చేతుల మీదుగా అందచేశారు . హ్యూమన్ మిల్క్ బ్యాంకు లో పని చేసిన స్టాఫ్ నర్సస్ కు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా హర్షవర్ధన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha