Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టమాట సాగు పై క్షేత్రస్థాయిలో సందర్శించిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు

టమాట సాగు పై క్షేత్రస్థాయిలో సందర్శించిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు

వార్త 3 weeks ago

Malla Reddy University Students: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామంలో తీగల శంకర్ అనే రైతు పండిస్తున్న టమాట సాగు పై క్షేత్రస్థాయిలో మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు సందర్శించి పలు విషయాలను తెలుసుకున్నారు.

టమాట పంటను మొదటి దశ నుండి టమాటలు వచ్చేవరకు ఏ విధంగా సాగు చేస్తారో రైతు శంకర్ విద్యార్థులకు వివరించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు సైతం స్వయంగా టమాట మొక్క తీగలను పందిళ్ళ పైకి పాకేలాగా తాళ్లతో పందిళ్లకు అనుసంధానం చేస్తూ కట్టారు.

Read Also : Tribal Areas Health Policy: గిరిజనులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

 Malla Reddy University students visited tomato cultivation fields.

Malla Reddy University Students: టమాట సాగు మెలుకువలు తెలుసుకున్న విద్యార్థిను

ఈ సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థిని శైలజ, హారిక, గాయత్రిలు మాట్లాడుతూ గ్రామీణ వ్యవసాయ సాగు పై అవగాహన శిక్షణ కార్యక్రమంలో భాగంగా తునికి గ్రామానికి చెందిన టమాటా రైతు శంకర్ వ్యవసాయ కులానికి విచ్చేసినట్టు వారు తెలిపారు. టమాట సాగులో మెలుకులను, టమాట మొక్కకు సోకే వ్యాధుల నివారణకు ఇచ్చే సంహారక మందులపైన రైతును అడిగి తెలుసుకున్నట్టు వాళ్ళు తెలిపారు.

క్షేత్రస్థాయిలో సందర్శించడం చాలా సంతోషంగా, పచ్చటి పొలాలలో వీచే చల్లటి గాలిని ఆస్వాదించడంతో పాటు ఆనందంగా ఉందని వారు అన్నారు. నిజ జీవితంలో రైతు కష్టపడి పండించే పంటల పైన క్షేత్రస్థాయిలో మేము తెలుసుకోవడం మా శిక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు తో పాటు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ ప్రోగ్రామ్‌ను బహిష్కరించిన మీడియా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha