Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు డిప్యూటీ సీఎం ఈయనేనా?

తమిళనాడు డిప్యూటీ సీఎం ఈయనేనా?

వార్త 2 weeks ago

మిళనాడు రాజకీయాల్లో సెంగోట్టయాన్ ఒక పరిచయం అక్కర్లేని పేరు. 1948లో జన్మించిన ఆయన, రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు పొందారు. అత్యవసర పరిస్థితి (Emergency) తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అప్పటి నుంచి ఐదు దశాబ్దాల పాటు ఆయన రాజకీయ ప్రస్థానం నిరంతరాయంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న సంబంధాలు, పాలనాపరమైన పట్టు ఆయనను రేసులో ముందుంచుతున్నాయి. విజయ్ వంటి యువ నాయకుడికి సెంగోట్టయాన్ లాంటి అనుభవజ్ఞుడి తోడ్పాటు ఎంతో అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : అన్నాడీఎంకేలో భారీ తిరుగుబాటు.. 36 మంది ఎమ్మెల్యేలు జంప్‌కు రెడీ!

జయలలిత నమ్మకస్థుడి నుంచి టీవీకే సమన్వయకర్త వరకు

మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు అత్యంత సన్నిహితుడిగా, ఆమె నమ్మకస్థుడిగా సెంగోట్టయాన్‌కు మంచి పేరుంది. అన్నాడీఎంకే (AIADMK) ప్రభుత్వాల్లో ఆయన పలుమార్లు కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలు ఆయనకే దక్కుతాయని ఒక దశలో అందరూ భావించారు. అయితే, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2025లో ఎడప్పాడి పళనిస్వామి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK)లో చేరి, పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు సముచిత స్థానం దక్కబోతోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి.

ఆర్థిక బలం మరియు రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు

సెంగోట్టయాన్ కేవలం రాజకీయ అనుభవమే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంతో బలవంతుడు. పార్టీ నిర్వహణలో మరియు ఎన్నికల వ్యూహరచనలో ఆయనది అందెవేసిన చేయి. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడు (కొంగు బెల్ట్)లో ఆయనకు బలమైన సామాజిక వర్గ మద్దతు ఉంది. విజయ్ ప్రభుత్వానికి పటిష్టమైన పునాది వేయడానికి, పరిపాలనలో తప్పులు దొర్లకుండా చూడటానికి సెంగోట్టయాన్ వంటి సీనియర్ నేత డిప్యూటీ సీఎంగా ఉండటం వల్ల ప్రభుత్వానికి అదనపు బలం వస్తుందని టీవీకే శ్రేణులు ఆశిస్తున్నాయి. ఒకవేళ ఆయనకు ఈ పదవి దక్కితే, అది విజయ్ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయంగా మారుతుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కాసపేట్లో సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha