తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేస్తోంది.
దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రావిడ దిగ్గజాలను వెనక్కి నెట్టి విజయ్ పార్టీ ముందంజలో ఉండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. లీడింగ్‌లో TVK: ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా (Single Largest Party) అవతరించే దిశగా దూసుకుపోతోంది.
Read Also: West Bengal Election Results: సొంత గడ్డపై దీదీ వెనుకంజ.. బెంగాల్‌లో కమలం వికాసం!
Tamil Nadu Election Results
Tamilnadu ElectionResults: వెనుకబడిన దిగ్గజాలు
అధికార పార్టీ అయిన ఎం.కె. స్టాలిన్ సారథ్యంలోని DMK కూటమి, అలాగే పళనిస్వామి నేతృత్వంలోని AIADMK పార్టీలు విజయ్ వేగాన్ని అందుకోలేక వెనుకబడ్డాయి. విజయ్ వ్యక్తిగతంగా తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ – పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ – భారీ మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. తమిళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ముఖ్యంగా యువత మరియు సినీ అభిమానులు విజయ్ వైపు మొగ్గు చూపారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

