Dailyhunt
తమిళనాడులోని విరుదునగర్‌లో బాణసంచా కర్మాగారంలో పేలుడు

తమిళనాడులోని విరుదునగర్‌లో బాణసంచా కర్మాగారంలో పేలుడు

వార్త 1 week ago

Virudhunagar Blast Today: తమిళనాడులోని విరుధ్‌నగర్ జిల్లా సత్తూర్ సమీపంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి ఒక పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 60 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also :Bihar Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం!

 Explosion at a fireworks factory in Virudhunagar, Tamil Nadu

కొనసాగుతున్న సహాయక చర్యలు

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కొంత భాగం ధ్వంసమైందని, దట్టమైన పొగలు అలుముకోవడంతో లోపల ఉన్న వారిని బయటకు తీయడం సవాలుగా మారింది.

Virudhunagar Blast Today: కారణాలు తెలియాల్సి ఉంది

ఈ పేలుడు సంభవించడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. రసాయనాల మిశ్రమం తయారీలో జరిగిన పొరపాటా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ట్రక్కు-కారు భీకరంగా ఢీకొని ఏడుగురు మృతి.. సురేంద్రనగర్‌లో విషాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha