Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాట టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద విజిల్ సంబరాలు

తమిళనాట టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద విజిల్ సంబరాలు

వార్త 1 month ago

Tamil Nadu Election Updates: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) అద్భుత ప్రదర్శన చేస్తోంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, విజయ్ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం కాగా, మధ్యాహ్నం 2 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం టీవీకే ఏకంగా 111 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు అధికార డీఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితమై భారీ పతనాన్ని చవిచూడగా, అన్నాడీఎంకే 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Tamil Nadu Election Updatesవిజయ్ ఇంట్లో ‘విజిల్’ సంబరాలు

పార్టీ ఘనవిజయం దిశగా సాగుతుండటంతో విజయ్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ గుర్తు అయిన ‘విజిల్’ వేస్తూ విజయ్ కుటుంబ సభ్యులు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ సోఫాలో కూర్చుని విజిల్ వేస్తూ, విక్టరీ గుర్తు చూపిస్తూ మురిసిపోయారు. చిన్నా పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను విజయ్ టీమ్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also : Srikalahasti road accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు దుర్మరణం

 TV is a hit in Tamil Nadu… Vijay’s family blew the whistle

స్టాలిన్ కోటలో బీటలు.. 100 సీట్లు గల్లంతు

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధికార డీఎంకేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2021లో 159 సీట్లు గెలుచుకున్న స్టాలిన్ కూటమి, ఈసారి దాదాపు 100 సీట్లను కోల్పోయింది. అన్నాడీఎంకే కూడా తన బలాన్ని నిలబెట్టుకోలేకపోయింది. విజయ్ ఎంట్రీతో తమిళనాట సాంప్రదాయ పార్టీల ఓటు బ్యాంకు భారీగా చీలిపోయిందని, ముఖ్యంగా యువత మరియు మహిళా ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆస్తి కోసం కోడలి మృతదేహానికి అత్తింట్లోనే గుంత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha