Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

వార్త 4 months ago

మిళనాడు (TamilNadu) లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో సేలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో విజయ్ సంచలన ప్రకటనలు చేశారు.

తమ పార్టీ TVK (తమిళగ వెట్రి కళగం) వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, కూటముల్లోనూ చేరబోమని ఆయన స్పష్టం చేశారు.ఫుల్ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.అలాగే కొందరు ఓటుకు రూ.5వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆ డబ్బు ప్రజలదే అని దాన్ని తీసుకొని వారి చెవుల్లో విజిల్ వేసి వెళ్లగొట్టాలన్నారు.

Vijayasai Reddy: 'వందేమాతరం' పూర్తి గీతాన్ని పాడాల్సిందే

మృతిచెందినట్లు సమాచారం?

మరోవైపు ఈ సభలో అపశ్రుతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన 37 ఏళ్ల సూరజ్‌గా గుర్తించినట్లు సేలం పోలీసులు తెలిపారు. మృతుడు సేలంలోని సెవ్వైపట్టై ప్రాంతంలో నివసిస్తున్నాడని, వెండి సంబంధిత కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. అతడికి పెళ్లైందని, భార్యా, బిడ్డతో కలిసి ఉంటున్నట్లు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha