Raghurama Krishna Raju: ఆంధ్రప్రదేశ్ సీబీ సీఐడీ మాజీ అధినేత, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ లక్ష్యంగా రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భీమవరంలో నిర్వహించిన ఒక సభలో సునీల్ కుమార్ మాట్లాడిన మాటలపై పోలీసులు వెంటనే విచారణ జరపాలని ఆయన కోరారు. తానే స్వయంగా చొరవ తీసుకుని దాదాపు 4,000 ఎస్సీ, ఎస్టీ కేసులలో ఛార్జిషీట్లు దాఖలు చేయించానంటూ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణరాజు తీవ్రంగా ఆక్షేపించారు. సాధారణ ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులకు, సీబీ సీఐడీ విభాగానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అత్యంత కీలకమైన, సంచలనాత్మకమైన కేసులు అయితే తప్ప సీఐడీ పరిధిలోకి 200 కంటే ఎక్కువ కేసులను బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
Raghurama Comments
Read also: Ramprasad Reddy: వైసీపీ ప్రభుత్వం అమరావతిని అల్లకల్లోలం చేసింది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
నా కస్టోడియల్ టార్చర్ కేసులో పాత్ర క్లియర్ అవుతోంది!
నిబంధనలకు విరుద్ధంగా 4,000 కేసుల్లో తానే ఛార్జిషీట్లు వేయించానని సునీల్ కుమార్ బాహాటంగా చెప్పుకోవడం చూస్తుంటే, గతంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ ఉదంతంలో ఆయన ప్రమేయం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అసలు ఆయా కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయించడంలో ఒక ఐపీఎస్ అధికారిగా ఆయనకు ఉన్న సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
Raghurama Krishna Raju: హింసను ప్రేరేపించే వారిపై చర్యలు తీసుకోవాలి!
అదే సమావేశంలో పాల్గొన్న ఢిల్లీకి చెందిన జాన్‌మార్క్ అనే వ్యక్తి.. సమాజంలో హింసను, ఘర్షణలను రెచ్చగొట్టేలా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. ‘వాళ్లను వేసేయాలి, వీళ్లను వేసేయాలి’ అంటూ బహిరంగంగా మాట్లాడటం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన మంచి ప్రభుత్వం నడుస్తోందని.. ఇలాంటి వేళ హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూటమి ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నానని రఘురామ పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

