Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పుడు అకౌంట్లుతో బ్యాంకులకు టోకరా.. నిందితుడు అరెస్టు

తప్పుడు అకౌంట్లుతో బ్యాంకులకు టోకరా.. నిందితుడు అరెస్టు

వార్త 3 months ago

7 కోట్ల విలువైన స్థిర చరాస్థుల డాక్యుమెంట్లు స్వాధీనం

Fake accounts bank fraud: విజయవాడలోని పలు యాక్సిక్ బ్యాంకు బ్రాంచ్ లలో 2019 నుండి 26 సేవింగ్ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డ్ల ద్వారా వివిధ లోన్ రూపాలలో లోన్లను తీసుకొని వాటిని కట్టకుండా మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, సదరు కేసును త్వరగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేయాలని సిపి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు సైబర్ క్రైం డిసిపి కె.

కృష్ణప్రసన్న, సైబర్ క్రైం ఎసిపి నేతృత్వరంలో పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా సదరు ప్రత్యేక బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులైన కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన నీలం పవన్కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించి అతని వద్ద నుండి వివిధ స్థిరాస్థులకు చెందిన 34 డాక్యుమెంట్ లను, ఒక కారు, ఒక బైక్, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఎటిఎం కార్డులు, రూ.11,500 నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Read Also : Tvisha Sharma death case: ట్విషాశర్మ మృతి కేసులో సీసీటీవీ ట్విస్ట్.. అసలేం జరిగింది?

 Banks were robbed with fake accounts.. Accused arrested

Fake accounts bank fraud: తప్పుడు పత్రాల తో మోసం

నిందితుడు నీలం పవన్కుమార్ ఈ సేవలో పనిచేసే క్రమంలో జల్సాలకు అలవాటుపడి తనకు వచ్చిన జీతం జల్సాలకు సరిపోక ఏ విధంగానైనా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తప్పుడు శాలరీ స్లిప్స్, ఐడి కార్డులు మొదలైన బ్యాంక్ లో లోన్ పొందడానికి అవసరమైన పత్రాలను తయారు చేసుకొని వాటిని ఉపయోగించి సదరు బ్యాంక్ యొక్క గుణదల బ్రాంచి నందు 9 ఫేక్ అకౌంట్ల ద్వారా 1.76 కోట్ల రూపాయలు, ఏలూరు రోడ్ బ్రాంచి నందు 10 ఫేక్ అకౌంట్స్ ద్వారా 1.32 కోట్ల రూపాయలు, మెయిన్ బ్రాంచి నందు 7 ఫేక్ అకౌంట్ల ద్వారా 2.20 కోట్ల రూపాయిలు, మొత్తం 26 అకౌంట్ల ద్వారా సుమారు 5.28 కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకుని వాటిని కట్టకుండా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసాడు. ఇతనిపై గతంలో గూడూరు పోలీసే స్టేషన్, బందరు పోలీస్ స్టేషన్, భవానీపురం పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయని ఆయన తెలిపారు. కీలకమైన కేసును ఛేధించడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని అధికారులు అభినందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తిరుపతి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం.. గంటపాటు నిలిచిన వాహనాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha