Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం.. గంటపాటు నిలిచిన వాహనాలు!

తిరుపతి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం.. గంటపాటు నిలిచిన వాహనాలు!

వార్త 3 months ago

Tirupati News: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఆదివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు సంచారంతో సుమారు గంటపాటు రాకపోకలు స్తంభించాయి.

అటవీశాఖ అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతంలోకే తరిమేందుకు బాణాసంచా పేల్చినప్పటికీ ససేమిరా అంటూ మొరాయించాయి. చివరకు రోడ్డు దాటుకుని ఏనుగుల గుంపు వెళ్ళడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అందులో రెండు అంబులెన్సులు ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Read also: Atchannaidu: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచే కాలువల్లోకి సాగునీరు విడుదల!

 Elephants on Bhakarapet Ghat Road AP

Tirupati News: రంగంలోకి అటవీ సిబ్బంది.. అంబులెన్స్‌ల డైవర్షన్

ఎమ్మెల్యే ఆదేశంతో అటవీ, పోలీసు శాఖ అధికారులు ఏనుగులను రహదారిపై నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేసి రాకపోకలను క్రమబద్దీకరించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి రాత్రిపూట ప్రయాణికులకు, వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొద్దిరోజుల పాటు గస్తీ నిర్వహించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రాత్రివేళలో భాకరాపేట ఘాట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నమ్మించి.. భయపెట్టి 9వ తరగతి బాలికపై అత్యాచారం.. నలుగురిపై పోక్సో కేసు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha