Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. నేను తల వంచను: బండి సంజయ్

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. నేను తల వంచను: బండి సంజయ్

వార్త 2 weeks ago

Bandi Sanjay : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై స్పందిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కేంద్రం ఇచ్చే నిధులపైనే నడుస్తోందని బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఢిల్లీకి నిధులు పంపిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలపై కూడా బండి సంజయ్ స్పందించారు. "నేను ఏరోజు కూడా తల వంచుకునే పనులు చేయను. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కావాలనే నాపై కుట్రలు పన్ని దుష్ప్రచారం చేస్తున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ మైనర్ బాలికను వేధించాడంటూ ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల భద్రతపై మాట్లాడే బీజేపీ నేత కుటుంబంపైనే ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.

Read Also:TamilNadu Politics: ప్రకాశ్ రాజ్ 'సెల్యూట్' ఎవరికో తెలుసా?

అయితే ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని బండి సంజయ్ వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు (Bandi Sanjay) సాయి భగీరథ్ కూడా తనపై బ్లాక్‌మెయిల్ జరుగుతోందంటూ కౌంటర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే మోదీ సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha