Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్‌మీట్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్‌మీట్

వార్త 2 weeks ago

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

Ponnam Prabhakar: ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మూడు కార్యక్రమాలు తీసుకుంది..

తెలంగాణ లో ఉన్న ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం తీసుకొచ్చింది..ప్రతి కుటుంబానికి అండగా ఉండేలా కార్యక్రమాన్ని అమలు చేశాం.. 2 లక్షల పెన్షన్లు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు ,కవులు, కళాకారులు, గుర్తింపు గౌరవాన్ని ఇచ్చేలా గుర్తింపు కమిటీ ఏర్పాటు చేసి వారిని గుర్తించడానికి భవిష్యత్ లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించుకోవడం..అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కేసులు ,దాడులు ,నష్టపోయిన వారిని గౌరవించి గుర్తించే కార్యక్రమం తీసుకుంటున్నాం. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి దశలో ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం జరిగింది. రెండవ దశలో నిన్న ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఆసిఫాబాద్ లో ప్రారంభించారు.

Read Also : Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

 Telangana Formation Day.. Minister Ponnam Prabhakar’s press meet in Siddipet

Ponnam Prabhakarధాన్యం కొనుగోలు లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం..

వ్యవసాయ అధికారులు ,రైతులతో సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తాం. జిల్లాలో సంవత్సరానికి లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానీ ఇక్కడ 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. రైతులు మనకు అవసరమైన సన్న బియ్యం పండించేలా విత్తనాల నుండే అవగాహన కల్పిస్తాం.. ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. మన దగ్గర నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది..ప్రతి ఉద్యోగి జర్నలిస్ట్ లు ప్రతి ఒక్కరు ఏకకాలంలో మొక్కలు నాటేలా గ్రామగ్రామ నా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మా నియోజకవర్గంలో ప్లాంటేషన్ పై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకున్నాం.. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి కమిటీ వేసేలా ప్లాన్ చేస్తున్నాం.. 3 లక్షల ఈత చెట్లు సిద్ధంగా ఉన్నాయి.. కాలువల గట్లు ,ప్రభుత్వ స్థలాల్లో నాటడానికి ప్లాన్ చేస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య పెంచేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నాం. జూన్ 12 న స్కూల్ లు ప్రారంభం అవుతున్నాయి..అదే రోజు వారికి అవసరమైన కిట్లు అందిస్తాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ నిర్మాణం అవుతున్నాయి.. బడిబాట కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి.

రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపడుతున్నాం.

ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఉంటాయో..అక్కడ పాడైపోయిన వాహనాలు ఏర్పాటు చేస్తాం ..అవసరమైతే గతంలో ప్రమాదాల్లో మరణించిన వారి ఫోటోలు కూడా పెడతాం. తెలంగాణ ఆకాంక్షల కోసం రాష్ట్రం ఏర్పడింది.. వారికి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుంది..తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తరుపున ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతుంది.. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అనేక ఇళ్లు ఇచ్చాం.. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం..200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం.. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం.. ఆర్టీసీ ఆపరేషనల్ లాస్ నుండి లాభాల్లోకి తీసుకొచ్చాం.. రోజుకు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.. 35 లక్షల కిలోమీటర్లు బస్సులు ప్రయాణం చేస్తున్నాయి.. ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం.. త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి..

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha