Professor Jayashankar 92nd Jayanthi: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు.
“తెలంగాణ దారి దీపం, తెలంగాణ జ్ఞాన సూత్రం జయశంకర్ సార్” అంటూ కొనియాడారు. ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది’ అనే చందాన జయశంకర్ సార్ జీవితం చివరి శ్వాస వరకు సాగిందని స్మరించుకున్నారు.
Read Also : Telangana auto drivers: ఈ నెల 23 నుంచి ఆటో సేవలు బంద్
Jayashankar Sir is the guiding light of Telangana: KTR
Professor Jayashankar 92nd Jayanthi: ఉద్యమ సారథి కేసీఆర్‌కు గురుతుల్యులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారికి ఆయన గురుతుల్యులని గుర్తుచేశారు. తెలంగాణ భావజాలాన్ని నలుమూలలా వ్యాప్తి చేస్తూ, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ఆయన ప్రత్యేక రాష్ట్రానికి ఎల్లప్పుడూ ఒక దిక్సూచిలా నిలుస్తారని కొనియాడారు.
తెలంగాణ కోసం జయశంకర్ సార్ చేసిన అమూల్యమైన సేవలను గుర్తిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను సముచిత రీతిలో గౌరవించిందని కేటీఆర్ తెలిపారు. ఆయన జ్ఞాపకార్థం ఒక జిల్లాకు ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా’గా, రాష్ట్ర వ్యవసాయ విద్యాలయానికి ‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం’గా పేరు పెట్టి గౌరవించుకున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

