Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్ర కీలకం!

తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్ర కీలకం!

వార్త 3 weeks ago

Byri Shankar Mudiraj: మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఉద్యమకారులు, యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరవీరులయ్యారని, వారి అమూల్యమైన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ కొనియాడారు.

మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నాటి పార్లమెంట్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంలో భారతీయ జనతా పార్టీ (BJP) అత్యంత కీలకమైన, చారిత్రాత్మకమైన పాత్ర పోషించిందని గుర్తుచేశారు. నాడు బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా హైదరాబాద్‌కు విచ్చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. అలాగే, పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ నాటి ప్రతిపక్ష నేత, దివంగత సుష్మా స్వరాజ్.. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ బిడ్డలెవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. “తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టండి” అని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బిల్లు పాస్ చేయించింది బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు.

Read Also: తెలంగాణపై పూర్తి కమిట్‌మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్

Byri Shankar Mudiraj: కాంగ్రెస్ హయాంలో తిరోగమనం..

నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధాన సూత్రాల కోసం తెలంగాణ యువత సుదీర్ఘకాలం ఉధృతమైన పోరాటాలు చేసిందని బైరి శంకర్ అన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ తిరోగమన దిశలో పయనిస్తోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమరవీరుల ఆశయాలు నేరవేరాలన్నా, తెలంగాణ తన అసలైన గొప్పదనాన్ని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పాలన్నా అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఘనమైన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు ఉమారెడ్డి, కాసానగొట్టు సంతోష్, గుండ్ల జనార్ధన్, సుతారి కార్తీక్, తాటికొండ శ్రీనివాస్, కెమ్మసారం సంతోష్, సునీల్, కనకరాజు, మహేందర్, యాదగిరి, వెంకట్రాంరెడ్డి, సాగర్ తదితర నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha