TG Inter Results Release: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మరికొద్ది నిమిషాల్లోనే ఫలితాలను విడుదల చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరీక్షణకు నేడు తెరపడనుంది.
అందరి దృష్టి ఇప్పుడు ఫలితాల పైనే ఉంది.
Read Also:TG Inter Results 2026: మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు..
ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో మొత్తం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆ తర్వాత మార్చి 15వ తేదీ నుంచి 20 కేంద్రాల్లో పరీక్ష పత్రాల మూల్యాంకనం మొదలై ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తి చేశారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఫలితాలకు సంబంధించిన అన్ని పనులను ముగించిన ఇంటర్ బోర్డు అధికారులు.. రికార్డు స్థాయి వేగంతో రిజల్స్ట్ విడుదలకు చర్యలు చేపట్టారు. ఇక 2026లో 9,97,075 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా.. అందులో మొదటి సంవత్సరం వారు 4,89,126 మంది.. రెండో సంవత్సరం వారు 5,07,949 మంది ఉన్నారని ఇంటర్ బోర్డు లెక్కలు చెబుతున్నాయి.
TG Inter Results Release: ఫలితాలను ఇలా చూసుకోండి
మీ ఫలితాలను నేరుగా చూసుకోవడానికి కింద పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోండి:
tgbie.cgg.gov.in
results.cgg.gov.in
tgbienew.cgg.gov.in

రిజల్ట్ చెక్ చేసుకునే విధానం
పైన ఉన్న ఏదైనా ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో 'TG Inter 1st Year Results 2026' లేదా 'TG Inter 2nd Year Results 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) ఎంటర్ చేయండి.
'Submit' బటన్ నొక్కితే మీ మార్కుల మెమో స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
బటన్ నొక్కితే నంబర్ ప్లేట్ చేంజ్.. చిక్కుల్లో బిఎండబ్ల్యూ డ్రైవర్!

