Mahabubabad road accident: మహబూబాబాద్ జిల్లాలో అతివేగం ముగ్గురు ప్రాణాలను బలిగొనడమే కాకుండా, ఒక కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Read Also : Inder Kaur Murder Case:పంజాబీ గాయని ఇందర్ కౌర్ దారుణ హత్య.. అసలేం జరిగింది?
Fatal accident in Mahabubabad
Mahabubabad road accident: ధాన్యపు ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్15 బైక్
వివరాల్లోకి వెళితే.. ధాన్యం లోడ్‌తో ఉన్న ఒక ట్రాక్టర్ రైస్ మిల్లుకు వెళుతోంది. అదే సమయంలో దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్ (25), లింగమల్ల సతీష్ (28), పొట్టకర్ల వంశీ (22) అనే ముగ్గురు యువకులు హెవీ స్పీడ్ తో స్పోర్ట్స్ బైక్‌పై వరంగల్ వైపు వెళ్తున్నారు. బైక్ విపరీతమైన వేగంతో ముందూ వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే రక్తం మడుగులో నిర్జీవంగా పడిపోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన లింగమల్ల సతీష్ భార్య మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. భార్య లేకపోయినా తన ఇద్దరు పిల్లలను సతీష్ అల్లారుముద్దుగా, ఎంతో కష్టపడి పోషిస్తున్నాడు. ఇప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి సతీష్ కూడా అకాల మరణం చెందడంతో.. ఆ ఇద్దరు పసిపిల్లలు పూర్తిగా అనాథలయ్యారు. ఒకే ఒక బైక్ వేగం ముగ్గురి ప్రాణాలను మింగేసి, మూడు కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com

